ఏపీఎల్ పండుగ షురూ..

ఏపీఎల్ పండుగ షురూ..

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున ఏపీఎల్ కు సమయం ఆసన్నమైంది
నెల రోజుల పాటు ఆంధ్ర లో క్రికెట్ ఫీవర్
3వేదికల్లో పూర్తి అయ్యిన ఏర్పాట్లు
గ్రామీణ క్రీడాకారులను వెలికితీయ్యడమే ఏపీఎల్ ప్రధాన ఉద్దేశం…
ఏపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ సుజయ కృష్ణ రంగారావు

విశాఖపట్నం, ఆంధ్రప్రభ : విశాఖపట్నం లోని ఏసీఏ వీడిసిఏ స్టేడియంలో ఏపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ సుజయ్ కృష్ణ రంగారావు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఏపీఎల్ సీజన్ 5 రేపటి నుండి ప్రారంభం కానున్న నేపథ్యంలో పూర్తి వివరాలు మీడియాకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ పీ ఎల్ 4 సీజన్లలో ఏ విధంగా ప్రజల నుంచి ఆదరణ సపోర్ట్ లభించిందో చేసిన ఫైవ్ కు కూడా అదే విధమైన సహకారం ఇవ్వాలని కోరారు. గత సీజన్స్ కన్నా ఐదవ సీజన్ చాలా భిన్నమైనదని ఈ ఏపీఎల్ 5వ సీజన్ సీజన్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కి మేలు జరిగే విధం గా ఉండబోతుంది అని అన్నారు.

మూడు ప్రాంతాల్లో ఏపీఎల్ జరగబోతుంది అని మొదట గా వైజాగ్లోఈ నెల 9 నుండి 14 వరకు, 17 నుండి 21 వరకు కడప లో 24 నుండి 30 వరకు మంగళగిరి లో మ్యాచ్ లు జరుగుతాయి అని తెలిపారు. ఇప్పటికే కొట్లాది రూపాయిలు వెచ్చించి వసతులు పెంచడం జరిగింది రాబోయే రోజుల్లో మరిన్ని స్టేడియంస్ లో ఏపీఎల్ జరగబోతుంది అని తెలిపారు. ఐపీఎల్ ద్వారా ఏదైతే ఏసీ ఏ ఆలోచన చేసిందో ఆలోచనను ఏపీఎల్ సఫలీకృతం చేస్తుందని తెలిపారు ఇటీవల ఆంధ్ర జట్టు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ మరియు ఐపీఎల్లో ఆంధ్ర క్రికెటర్స్ అద్భుత ప్రదర్శన ఇందుకు నిదర్శనమని అన్నారు ఓపెనింగ్ సేర్మోని సాయంత్రం 6 గంటలకు ప్రారంభం కాబోతుందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ముఖ్యఅతిథిగా ఏపీఎల్ ప్రారంభోత్సవానికి హాజరవుతారని తెలిపారు మరొకవైపు అభిమానులను అలరించడం కోసం ప్రముఖ నాయకురాలు సునీతతో కల్చరల్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ఇప్పటికే టీమ్స్ అన్ని పూర్తి సహాయ సహకారాలు అందించాలని అన్నారు ఇటీవల ఐపీఎల్లో అద్భుత ప్రదర్శన చేసినటువంటి నితీష్ కుమార్ రెడ్డి త్రిపురాణ విజయ్ పైలా అవినాష్ లాంటి ఐపీఎల్ స్టార్ ఆటగాళ్లు ఈ సీజన్లో ఏపీఎల్లో అలరించనున్నట్లు తెలిపారు. గ్రామీణ క్రీడాకారులకు ఏపీఎల్ మంచి వేదికని క్రీడాకారులందరూ ప్రతిభను ప్రదర్శించి జాతీయ జట్టులో ఆంధ్ర క్రికెటర్లు ఎక్కువమంది ఉండేలాగా చేయాలన్నదే ఏపీఎల్ ఏసీఏ ఉద్దేశమని తెలిపారు మంగళగిరి ఏసీఏ స్టేడియం పూర్తిగా మ్యాచ్లకు సిద్ధమైందని కడప స్టేడియం ఇంటర్నేషనల్ మ్యాచులకు సైతం సిద్ధంగా ఉందని అన్నారు. తొలి మ్యాచ్ గా సింహాద్రి వైజాగ్ లయన్స్ వర్సెస్ కాకినాడ కింగ్స్ మధ్య తొలి మ్యాచ్ రేపు 7:30 గంటలకు ప్రారంభం కానున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో సి ఓ ఓ గిరీష్ డోంగ్రే, గవర్నింగ్ కౌన్సిల్ మెంబర్ రంగనాథ్, ఏసిఏ గేమ్ డెవలప్మెంట్ మేనేజర్ ఎమ్మెస్ కుమార్ పాల్గొన్నారు.

Leave a Reply