Vaibhav Suryavanshi | వైభ‌వ్‌పై డివిలియ‌ర్స్ ప్ర‌శంస‌లు

Vaibhav Suryavanshi | వైభ‌వ్‌పై డివిలియ‌ర్స్ ప్ర‌శంస‌లు

Vaibhav Suryavanshi | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌: భారత యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ ఎంపికపై దక్షిణాఫ్రికా మాజీ స్టార్ బ్యాటర్ ఏబీ డి విలియర్స్ స్పందించారు. వయసు, అనుభవం పేరుతో వైభవ్‌ను తక్కువ అంచనా వేయకూడదని, తన ప్రతిభతోనే అతను జాతీయ జట్టు ఎంపికకు మార్గం సుగమం చేసుకున్నాడని అభిప్రాయపడ్డారు. భారత సెలక్టర్ల నిర్ణయాన్ని డివిలియర్స్ “సరైనదే కాకుండా ధైర్యమైన నిర్ణయం”గా అభివర్ణించాడు. “అతను ఇంకా చిన్నవాడు, సిద్ధంగా లేడు, మరింత అనుభవం అవసరం అని చెప్పడం సులభమే. కానీ అతను తన ఆటతో ఎంపికకు అర్హత సాధించాడు. భారత టీ20 జట్టులో తన స్థానానికి అతను అర్హుడు” అని డి విలియర్స్ అభిప్రాయపడ్డాడు. వైభవ్‌లాంటి యువ ఆటగాడికి అవకాశం ఇవ్వడం భారత క్రికెట్ భవిష్యత్తుకు మంచిదని ఆయన వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది.

15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీకి సీనియర్ భారత జట్టులో చోటు దక్కడం ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో పెద్ద చర్చగా మారింది. ఐర్లాండ్, ఇంగ్లాండ్‌లతో జరిగే టీ20 విదేశీ పర్యటనలకు అతన్ని ఎంపిక చేసిన నేపథ్యంలో, అంతర్జాతీయ స్థాయిలో అతను ఎలా రాణిస్తాడన్న ఆసక్తి పెరిగింది. అతని వయసును దృష్టిలో పెట్టుకుని బీసీసీఐ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తూ, విదేశీ పర్యటనల్లో అతని తల్లిదండ్రులు కూడా వెంట ఉండేలా చర్యలు తీసుకుంటుంది.

ఇక వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్‌లోనూ చిన్న వయసులోనే సంచలన ప్రదర్శనలతో గుర్తింపు తెచ్చుకున్నాడు. రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడిన అతను, ఐపీఎల్‌లో అత్యంత పిన్న వయసులో అరంగేట్రం చేసిన ఆటగాడిగా నిలవడంతో పాటు, సెంచరీతోనూ రికార్డులు నెలకొల్పాడు.

Leave a Reply