అసంపూర్తి రోడ్డు పనులు పూర్తి చేయాలి..

అసంపూర్తి రోడ్డు పనులు పూర్తి చేయాలి..

మోత్కూర్‌లో బీఆర్ఎస్ రాస్తారోకో

మోత్కూర్, ఆంధ్రప్రభ:

మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలోని పనకబండ చౌరస్తా నుంచి రాజన్నగూడెం వరకు అసంపూర్తిగా ఉన్న డబుల్ బీటీ రోడ్డు పనులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నాయకులు ఆదివారం మోత్కూర్–రాయగిరి ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే మందుల సామేల్ పనితీరుపై బీఆర్ఎస్ నాయకులు విమర్శలు గుప్పించారు.

వారు మాట్లాడుతూ, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2023లో తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ మోత్కూర్–రాజన్నగూడెం డబుల్ బీటీ రోడ్డు నిర్మాణానికి రూ.5.80 కోట్లు మంజూరు చేసి శంకుస్థాపన చేశారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రస్తుత ఎమ్మెల్యే మందుల సామేల్ అదే పనులకు మరోసారి శంకుస్థాపన చేసి ప్రచారం చేసుకున్నారని ఆరోపించారు.

గత రెండున్నరేళ్లుగా రోడ్డు పనులు పూర్తికాకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ప్రతిరోజూ ఇదే రహదారిపై ప్రయాణించే ఎమ్మెల్యేకు ప్రజల సమస్యలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే ఉన్నతాధికారులతో మాట్లాడి రోడ్డు పనులను వెంటనే ప్రారంభించి పూర్తి చేయించాలని, లేకపోతే ప్రజలతో కలిసి ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల, పట్టణ అధ్యక్షులు పొన్నెబోయిన రమేష్, జంగ శీను, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కొనతం యాకూబ్ రెడ్డి, రైతుబంధు మాజీ అధ్యక్షుడు కొండ సోమల్లు, మున్సిపల్ ప్రధాన కార్యదర్శి గజ్జి మల్లేష్, మాజీ సర్పంచులు బయ్యని పిచ్చయ్య, రాంపాక నాగయ్య, కౌన్సిలర్ సుల్తాన్ స్వామి, ఎస్సీ, ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యుడు దాసరి తిరుమలేష్, సింగిల్ విండో డైరెక్టర్ సామ పద్మారెడ్డి, పార్టీ నాయకులు కంచర్ల కాంత్‌కుమార్ రెడ్డి, కూరెళ్ల పరమేష్, జంగ శివ, మొరిగాల శ్రీను, బొడిగ శ్రీను, వెంకన్న, కోక బిక్షం, చేతరాశి చంద్రయ్య, లోతుకుంట స్వామి, అన్నందాస్ విద్యాసాగర్, తాటి లక్ష్మణ్, పోన్నెబోయిన మచ్చగిరి, జంగ నరేష్, కూరెళ్ల రమేష్, చుక్క అశోక్, దాసరి నవీన్, కొంపెల్లి మల్లేష్, బొడిగ మల్లేష్, పసునూరి యాదయ్య, చెడిపల్లి ఆనందు, నాగరాజు, బోడ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply