జిల్లా ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షుడిగా కుంభం ఇంద్రసేనారెడ్డి

జిల్లా ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షుడిగా కుంభం ఇంద్రసేనారెడ్డి

మునుగోడు, ఆంధ్రప్రభ: టీయూడబ్ల్యూజే (ఐజేయూ) అనుబంధ నల్లగొండ జిల్లా ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షుడిగా నల్లగొండ జిల్లా మునుగోడు మండలం సింగారం గ్రామానికి చెందిన సూర్య రిపోర్టర్ కుంభం ఇంద్రసేనారెడ్డిని నియమిస్తూ జిల్లా అధ్యక్షుడు గార్లపాటి కృష్ణారెడ్డి నియామక ఉత్తర్వులు జారీ చేశారు.ఈ సందర్భంగా గార్లపాటి కృష్ణారెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమం, హక్కుల పరిరక్షణే లక్ష్యంగా జిల్లా ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇటీవల నకిరేకల్‌లో జరిగిన జిల్లా మహాసభల్లో జిల్లా కమిటీతో పాటు ప్రెస్ క్లబ్ కార్యవర్గాన్ని కూడా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు పేర్కొన్నారు.

నూతనంగా బాధ్యతలు చేపట్టిన కుంభం ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ తనపై విశ్వాసం ఉంచి బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర, జిల్లా నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారం, సంక్షేమం కోసం అంకితభావంతో పనిచేస్తానని, సంఘం బలోపేతానికి కృషి చేస్తానని చెప్పారు. రాష్ట్ర అధ్యక్షుడు వీరహత్ హాలీ,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారాయణ, జిల్లా అధ్యక్షుడు గార్లపాటి కృష్ణారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి పులిమామిడి మహేందర్ రెడ్డి తదితరులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Leave a Reply