will-lpg-gas-prices-rise-further-india-middle-east-tensions-lpg-subsidy-impact-29 గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర‌లు మ‌రింత పెరుగుతాయా?

will-lpg-gas-prices-rise-further-india-middle-east-tensions-lpg-subsidy-impact-29 గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర‌లు మ‌రింత పెరుగుతాయా?

పెరిగిన వంటగ్యాస్ సిలిండర్ ధరలు
రెండోసారి పెంపు
సబ్సిడీలతో కేంద్రంపై పెరుగుతున్న ఆర్థిక భారం
ఎల్‌పీజీ ధరలు పెరగడానికి ప్రధాన కారణాలేమిటి?
యుద్ధాలు, ఉద్రిక్తతలు గ్యాస్ మార్కెట్‌పై చూపే ప్రభావం
దిగుమతులపైనే ఆధారపడుతున్న భారత్
సౌదీ అరేబియా సహా మధ్యప్రాచ్య దేశాల కీలక పాత్ర
గ్యాస్ ధరల పెరుగుదలపై అంతర్జాతీయ కారకాల ప్రభావం
సబ్సిడీలకు కోత పడే అవకాశం ఉందా?

will-lpg-gas-prices-rise-further-india-middle-east-tensions-lpg-subsidy-impact-29 ఆంధ్రప్రభ వెబ్, జాతీయం: సామాన్యుడిపై మరోసారి వంటగ్యాస్ భారం పడింది. డొమెస్టిక్ సిలిండర్ ధరపై ఒక్కసారిగా రూ.29 పెరిగింది. ఇదే సమయంలో మధ్యప్రాచ్య దేశాల్లో ఉద్రిక్తతలు కొనసాగుతుండటంతో భవిష్యత్తులో గ్యాస్ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఇరాన్-అమెరికా మధ్య పరోక్ష శాంతి చర్చలు నిలిచిపోయాయి. మరోవైపు ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతలు కూడా కొనసాగుతున్నాయి. ఈ పరిణామాలు మధ్యప్రాచ్య ప్రాంతంలో ఇంధన సరఫరాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. భారత్‌కు ఎల్‌పీజీ సరఫరాలో కీలక భాగస్వామిగా ఉన్న సౌదీ అరేబియా సహా పలు మధ్యప్రాచ్య దేశాల్లో అస్థిర పరిస్థితులు నెలకొంటే సరఫరా వ్యవస్థపై ప్రభావం పడే అవకాశం ఉంది. అదే జరిగితే దేశీయంగా గ్యాస్ ధరలు పెరగవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

will-lpg-gas-prices-rise-further-india-middle-east-tensions-lpg-subsidy-impact-29 పెరిగిన గ్యాస్ ధరలు
తాజా ధరల పెరుగుదల ప్రభావం దేశంలోని ప్రధాన నగరాలపై స్పష్టంగా కనిపిస్తోంది. దేశ రాజధాని న్యూఢిల్లీలో డొమెస్టిక్ సిలిండర్ ధర రూ.913 నుంచి రూ.942కు చేరుకుంది. హైదరాబాద్‌లో రూ.965గా ఉన్న సిలిండర్ ధర రూ.994కు పెరిగింది. మూడు నెలల వ్యవధిలో వంటగ్యాస్ ధరలు రెండోసారి పెరగడం గమనార్హం.

will-lpg-gas-prices-rise-further-india-middle-east-tensions-lpg-subsidy-impact-29

will-lpg-gas-prices-rise-further-india-middle-east-tensions-lpg-subsidy-impact-29 సబ్సిడీలతో కేంద్రంపై పెరుగుతున్న ఆర్థిక భారం
గ్యాస్ ధరలు పెరగడం వల్ల కేంద్ర ప్రభుత్వంపై ఆర్థిక భారం పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ప్రధానంగా ప్రధాన్ మంత్రి ఉజ్జ్వల యోజన (PMUY) లబ్ధిదారులకు ఎల్‌పీజీ సబ్సిడీ అందిస్తోంది. 2025–26 ఆర్థిక సంవత్సరంలో 14.2 కిలోల సిలిండర్‌పై రూ.300 చొప్పున, సంవత్సరానికి గరిష్టంగా 9 రీఫిల్లుల వరకు సబ్సిడీ ఇవ్వడానికి రూ.12,000 కోట్లు కేటాయించింది.

అదనంగా, తక్కువ ధరలకు ఎల్‌పీజీ సరఫరా చేయడం వల్ల ప్రభుత్వ చమురు మార్కెటింగ్ సంస్థలకు కలిగిన నష్టాలను భర్తీ చేసేందుకు రూ.30,000 కోట్లు మంజూరు చేసింది. దీంతో మొత్తం వ్యయం సుమారు రూ.42,000 కోట్లకు చేరుతోంది.

will-lpg-gas-prices-rise-further-india-middle-east-tensions-lpg-subsidy-impact-29 గ్యాస్ ధరలు పెరగడానికి కారణాలేమిటి?
భారత్‌లో ఎల్‌పీజీ ధరల పెరుగుదలకు ఒకే కారణం ఉండదు. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు, ఎల్‌పీజీ ధరలు, రూపాయి-డాలర్ మారకం విలువ, దిగుమతి వ్యయాలు, రవాణా ఖర్చులు, ప్రభుత్వ సబ్సిడీ విధానాలు వంటి అంశాలు కలిసి ధరలను ప్రభావితం చేస్తాయి.

భారత్‌లో దేశీయ ఉత్పత్తి కంటే దిగుమతులపై ఆధారపడటం ఎక్కువ. అందువల్ల ప్రపంచ మార్కెట్‌లో చిన్న మార్పు వచ్చినా దేశీయ ధరలపై ప్రభావం పడుతుంది.

will-lpg-gas-prices-rise-further-india-middle-east-tensions-lpg-subsidy-impact-29 ఉద్రిక్తతల ప్రభావం
మధ్యప్రాచ్యం లేదా రష్యా-ఉక్రెయిన్ వంటి ప్రాంతాల్లో ఉద్రిక్తతలు పెరిగితే చమురు, గ్యాస్ సరఫరా గొలుసులు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. దీంతో అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్, ఎల్‌పీజీ ధరలు పెరుగుతాయి. అలాగే సముద్ర రవాణాపై అనిశ్చితి నెలకొంటే షిప్పింగ్ ఖర్చులు కూడా పెరుగుతాయి. ఈ ప్రభావం చివరకు వినియోగదారులు చెల్లించే గ్యాస్ ధరలపై పడుతుంది.

will-lpg-gas-prices-rise-further-india-middle-east-tensions-lpg-subsidy-impact-29

will-lpg-gas-prices-rise-further-india-middle-east-tensions-lpg-subsidy-impact-29 దిగుమతులపైనే ఆధారం
భారత్ గ్యాస్ అవసరాలకు ప్రధానంగా మధ్యప్రాచ్య దేశాలపైనే ఆధారపడుతోంది. సౌదీ అరేబియా, కతార్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కువైట్, ఒమన్ దేశాల నుంచి పెద్ద ఎత్తున ఎల్‌పీజీ, ఎల్‌ఎన్‌జీ దిగుమతి అవుతున్నాయి. భారత్ గ్యాస్ దిగుమతుల్లో మధ్యప్రాచ్య దేశాల వాటా సుమారు 50–60 శాతం వరకు ఉంది.

అమెరికా నుంచి కూడా ఎల్‌పీజీ, ఎల్‌ఎన్‌జీ సరఫరా పెరుగుతోంది. ఆఫ్రికాలో నైజీరియా, అంగోలా, మొజాంబిక్ దేశాలు కూడా భారత్‌కు గ్యాస్ సరఫరా చేస్తున్నాయి. ఇటీవల రష్యా కూడా ఎల్‌ఎన్‌జీ సరఫరాలో తన భాగస్వామ్యాన్ని పెంచుతోంది.

will-lpg-gas-prices-rise-further-india-middle-east-tensions-lpg-subsidy-impact-29 అంతర్జాతీయ కారకాల ప్రభావమే ఎక్కువ
భారతదేశంలో గ్యాస్ ధరల పెరుగుదలపై దేశీయ కారణాల కంటే అంతర్జాతీయ పరిణామాల ప్రభావమే అధికంగా ఉంటుంది. యుద్ధాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, సరఫరా అంతరాయాలు, రవాణా వ్యయాల పెరుగుదల వంటి అంశాలు ధరలను ప్రభావితం చేస్తాయి. దిగుమతులపై అధికంగా ఆధారపడుతున్నందున ప్రపంచ మార్కెట్‌లో జరిగే మార్పులు భారత వినియోగదారులపై ప్రత్యక్ష ప్రభావం చూపుతున్నాయి. అవే గ్యాస్‌, ఆయిల్ ధ‌ర‌లు పెర‌గ‌డానికి కార‌ణాల‌వుతున్నాయి.

Also Read ప‌సిడి ప్రియుల‌కు ఊర‌ట‌

Leave a Reply