Odisha AEE Corruption | అవినీతితో రూ.కోట్లకు ప‌డ‌గెత్తి

Odisha AEE Corruption | అవినీతితో రూ.కోట్లకు ప‌డ‌గెత్తి

Odisha AEE Corruption | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : అవినీతి ద్వారా అక్రమంగా కోట్లు కూడబెట్టిన కేసుల్లో కింది స్థాయి ప్రభుత్వ ఉద్యోగులు సైతం రాత్రికి రాత్రే కోటీశ్వరులుగా వెలుగులోకి రావడం దేశంలో తరచూ జరుగుతుంటుంది. అలాంటి సంఘ‌ట‌నే ఒడిశాలో వెలుగు చూసింది. ఒడిశాలోని ఐటీడీఏ (ITDA – Integrated Tribal Development Agency) అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (AEE) వైకుంఠనాథ్ బెహెరా అవినీతి బాగోతంపై రాష్ట్ర విజిలెన్స్ అధికారులు జరిపిన దాడుల్లో భారీగా అక్రమాస్తులు బయటపడ్డాయి. జూనియర్ ఇంజినీర్‌గా రూ.6 వేల జీతంతో కెరీర్ ప్రారంభించిన ఈ అధికారి, అక్రమ మార్గాల ద్వారా కోట్లాది రూపాయల ఆస్తులు కూడబెట్టాడు. ఐటీడీఏ ఏఈఈ వైకుంఠనాథ్ బెహెరా ఇళ్లపై విజిలెన్స్ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఆయన బ్యాంక్ లాకర్ల నుంచి రూ.2 కోట్లకు పైగా నగదు, సుమారు 341 గ్రాముల బంగారం, రూ.45 లక్షల డిపాజిట్లను స్వాధీనం చేసుకున్నారు. అలాగే వివిధ ప్రాంతాల్లో 5 బహుళ అంతస్తుల భవనాలు, 14 ఖరీదైన ప్లాట్లను గుర్తించారు. ఈ భారీ అవినీతి ఆరోపణలపై ఒడిశా విజిలెన్స్ అధికారులు ఇంకా లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Leave a Reply