HYDRA Prajavani | హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్ వెల్ల‌డి

HYDRA Prajavani | హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్ వెల్ల‌డి

HYDRA Prajavani |ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌: హైడ్రా ప్రజావాణి కార్యక్రమాన్ని ఈ నెల 8, 15 తేదీల్లో నిర్వహించడం లేదని హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ తెలిపారు. పెండింగ్‌లో ఉన్న ఫిర్యాదులను పరిష్కరించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు హైడ్రా వెల్లడించింది. హైడ్రా ప్రజావాణి ద్వారా, అలాగే ఇతర మార్గాల్లో వచ్చిన అర్జీలు పెద్ద సంఖ్యలో పెండింగ్‌లో ఉన్నాయని అధికారులు తెలిపారు. వాటిని ప్రాధాన్యత క్రమంలో పరిశీలించి పరిష్కరించే ప్రక్రియ మే 11 నుంచి కొనసాగుతోందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పెండింగ్ అర్జీల క్లియరెన్స్‌ గడువును మరో రెండు వారాలు పొడిగించినట్లు స్పష్టం చేశారు.

హైడ్రా ప్రజావాణి కార్యక్రమం జూన్ 22వ తేదీ సోమవారం నుంచి యథావిధిగా పునఃప్రారంభమవుతుందని అధికారులు తెలిపారు. అత్యవసర సమస్యలు ఉన్నవారు హైడ్రా కార్యాలయంలో అధికారులను నేరుగా సంప్రదించవచ్చని గత ప్రకటనల్లో హైడ్రా సూచించింది. పెండింగ్ ఫిర్యాదుల పరిష్కారానికే ప్రజావాణిని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు హైడ్రా ఇప్పటికే ప్రకటించింది.

Leave a Reply