ఆన్‌ లైన్ బెట్టింగ్ బారిన రైల్వే ఉద్యోగి.. ఉరేసుకుని బలవన్మరణం?

ఆన్‌ లైన్ బెట్టింగ్ బారిన రైల్వే ఉద్యోగి.. ఉరేసుకుని బలవన్మరణం?

డోర్నకల్, ఆంధ్రప్రభ : మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం వెన్నారం గ్రామానికి చెందిన రైల్వే ఉద్యోగి బోయినపల్లి ఆంజనేయులు గ్రామ శివారులో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఆదివారం వెలుగులోకి వచ్చిన ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు శోకసంద్రంలో మునిగిపోయారు.

స్థానికుల కథనం ప్రకారం.. ఆంజనేయులు కొంత కాలంగా ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు అలవాటు పడి భారీగా ఆర్థిక నష్టాలు చవిచూశారని తెలుస్తోంది. సుమారు రూ.30 లక్షల మేర అప్పుల పాలైన నేపథ్యంలో మానసిక ఒత్తిడికి గురై ఈ దారుణ నిర్ణయం తీసుకున్నట్లు గ్రామంలో చర్చ జరుగుతోంది. అయితే ఆత్మహత్యకు గల అసలు కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Leave a Reply