Hyderabad Rain | నగరవాసులకు ఊరట

Hyderabad Rain | నగరవాసులకు ఊరట

పలు ప్రాంతాల్లో వర్షం..

Hyderabad Rain | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌ : కొద్దిరోజులుగా ఎండలు, ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్న హైదరాబాద్ నగరవాసులకు వర్షం కాస్త ఉపశమనం కలిగించింది. నగరంలోని పలు ప్రాంతాల్లో శనివారం సాయంత్రం వర్షం కురిసింది. జూబ్లీహిల్స్‌, ఫిలింనగర్‌, బోరబండ, యూసుఫ్‌గూడ, ఎస్‌ఆర్ నగర్‌, సనత్‌నగర్‌, రాయదుర్గం, హైదర్‌గూడ, ఉప్పరపల్లి తదితర ప్రాంతాల్లో వర్షం పడటంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది.

గత కొంతకాలంగా తీవ్ర ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరైన నగరవాసులు వర్షంతో ఊపిరి పీల్చుకున్నారు. ప్రధాన రహదారులపై వాహనదారులు అప్రమత్తంగా ప్రయాణిస్తున్నారు.

Leave a Reply