Goddali Party | ప్రజాసేవే కార్యకర్తల లక్ష్యం కావాలి
Goddali Party | ప్రజాసేవే కార్యకర్తల లక్ష్యం కావాలి
Goddali Party | ఆంధ్రప్రభ, వెబ్డెస్క్ : గొడ్డలి పార్టీ ఆగడాలు హద్దులు దాటితే సహించబోమని ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. ఎన్టీఆర్ భవన్లో శిక్షణ పొందుతున్న టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జిలతో సమావేశమైన సందర్భంగా ఆయన పార్టీ శ్రేణులకు కీలక సూచనలు చేశారు.
పార్టీకి ఓటమి రాకుండా అన్ని స్థాయిల్లో జాగ్రత్తలు తీసుకుంటున్నామని చంద్రబాబు తెలిపారు. పార్టీ బలోపేతానికి కార్యకర్తలు మరింత కృషి చేయాలని, ప్రజల మధ్య ఉండి సేవా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.
కార్యకర్తలు కేవలం రాజకీయాలకే పరిమితం కాకుండా ప్రజలకు మేలు చేసే నాయకులుగా ఎదగాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. అధికారంలో ఉన్నందున మరింత సహనం, ఓపికతో వ్యవహరించాలని సూచించారు.
పార్టీ వ్యవహారాలపై నిరంతరం సర్వేలు నిర్వహిస్తున్నామని చంద్రబాబు వెల్లడించారు. పార్టీ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా వ్యవహరించే వారిని ఉపేక్షించబోమని, తప్పులు చేసిన వారిపై కఠిన నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
