సమస్యల పరిష్కారానికి చక్కని వేదిక గ్రామసభ..
ఊట్కూర్, ఆంధ్రప్రభ : గ్రామాభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని వర్షాకాలం సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సమస్యల పరిష్కారానికి గ్రామసభ చక్కని వేదిక అని ఊట్కూర్ ఎంపీడీవో కిషోర్ కుమార్, సర్పంచ్ ఎం. రేణుక భరత్ అన్నారు. శనివారం నారాయణపేటజిల్లా ఊట్కూర్ గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరావు ఆయా శాఖల అంశాలను గ్రామసభలో చదివి వినిపించి వాటి ప్రాధాన్యతను వివరించారు.
ఈ సందర్భంగా ఎంపీడీవో, సర్పంచ్ మాట్లాడుతూ వర్షాకాల సన్నద్ధతసురక్షిత తాగునీరు ఘన వ్యర్థాల నిర్వహణ, జల సంరక్షణ, వన మహోత్సవం, ఓటరు జాబితాల ప్రత్యేక సవరణ పై ప్రజలకు వివరించారు.గ్రామంలో పరిశుభ్రత పాటించడం, నీటి వృథాను అరికట్టడం, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, వర్షాకాలంలో వ్యాధుల నివారణకు ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గ్రామాభివృద్ధికి ప్రజల సహకారం ఎంతోఅవసరమనిప్రతి ఒక్కరూ తమబాధ్యతలనునిర్వర్తించాలని కోరారు.
గ్రామంలో నెలకొన్న వివిధ సమస్యలు దశలవారీగా పరిష్కరిస్తామని అన్నారు. గ్రామసభలు సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరించేందుకు చక్కని వేదిక అని గ్రామసభలకు అన్ని రాజకీయ పార్టీల నాయకులు ప్రజలు హాజరు కావాలన్నారు. గ్రామంలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులు చేపట్టాల్సిన పనుల గురించి గ్రామసభలో ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రమేష్, డాక్టర్ సంతోషి, వార్డు సభ్యులు గోవిందమ్మ, భవిత, మంగమ్మ, అశోక్ గౌడ్, ఏఎన్ఎం గోవిందమ్మ తదితరులు పాల్గొన్నారు.
