T20 Squad | యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి అవకాశం..
T20 Squad | యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి అవకాశం..
T20 Squad | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనలతో పాటు ఆసియా క్రీడల కోసం భారత టీ20 జట్టును బీసీసీఐ ప్రకటించింది. జట్టుకు శ్రేయస్ అయ్యర్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేయగా, తిలక్ వర్మను వైస్ కెప్టెన్‌గా నియమించింది. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి జట్టులో చోటు కల్పించడం విశేషంగా మారింది.
దేశవాళీ, జూనియర్ స్థాయిలో ప్రతిభ కనబరిచిన వైభవ్ సూర్యవంశీకి జాతీయ జట్టులో అవకాశం కల్పించడం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. యువ ఆటగాళ్లకు ప్రాధాన్యం ఇస్తూ బీసీసీఐ భవిష్యత్ జట్టును తీర్చిదిద్దే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.

ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనల కోసం ఎంపిక చేసిన జట్టులో ప్రిన్స్ యాదవ్‌కు స్థానం దక్కగా, ఆసియా క్రీడల జట్టులో మాత్రం అతని స్థానంలో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాను ఎంపిక చేశారు. అంతర్జాతీయ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
భారత్ టీ20 జట్టు..
శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), రవి బిష్ణోయ్, అభిషేక్ శర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, మహ్మద్ సిరాజ్, సంజూ శాంసన్, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, ఇషాన్ కిషన్, వాషింగ్టన్ సుందర్, అర్ష్‌దీప్ సింగ్, శివమ్ దూబె, వరుణ్ చక్రవర్తి, ప్రిన్స్ యాదవ్, వైభవ్ సూర్యవంశీ.
