Lift Accident | రెండో అంతస్తు నుంచి కుప్పకూలిన లిఫ్ట్..

Lift Accident | రెండో అంతస్తు నుంచి కుప్పకూలిన లిఫ్ట్..

నాయకులకు స్వల్ప గాయాలు

Lift Accident | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌ : కరీంనగర్ జిల్లాలో మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు తృటిలో ప్రమాదం తప్పింది. ఓ కార్యక్రమానికి హాజరైన సమయంలో ఆయన వెళ్తున్న లిఫ్ట్ ఒక్కసారిగా రెండో అంతస్తు నుంచి గ్రౌండ్ ఫ్లోర్‌కు కుప్పకూలింది. ఈ ఘటనతో అక్కడ ఒక్కసారిగా భయాందోళనలు నెలకొన్నాయి.

మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్ జన్మదిన వేడుకల్లో పాల్గొనేందుకు వెళ్లిన ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ లిఫ్ట్‌లో వెళ్తున్నారు. ఆయనతో పాటు ఆరెపల్లి మోహన్‌, మరో ఆరుగురు నాయకులు కూడా లిఫ్ట్‌లో ఉన్నారు. ఈ సమయంలో సాంకేతిక లోపంతో లిఫ్ట్ ఒక్కసారిగా కిందపడిపోయినట్లు సమాచారం.

లిఫ్ట్ కూలిన ఘటనలో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణతో పాటు ఇతర నాయకులు స్వల్ప గాయాలతో బయటపడినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న సిబ్బంది వెంటనే వారిని బయటకు తీసి ప్రాథమిక చికిత్స అందించారు. ఘటనకు గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.

Leave a Reply