Janasena | రాజ్యసభ సభ్యుడిగా లింగమనేని..

Janasena | రాజ్యసభ సభ్యుడిగా లింగమనేని..

అమరావతి, ఆంధ్రప్రభ: జనసేన పార్టీ తరఫున రాజ్యసభ సభ్యుడిగా జనసేన పార్టీ ప్రముఖ పారిశ్రామికవేత్త, పార్టీ నాయకుడు లింగమనేని రమేష్ పేరును ఖరారు చేసింది. రాజ్యసభ అభ్యర్థిగా ఎంపిక చేసినందుకు జనసేన పార్టీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు లింగమనేని రమేష్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే తన అభ్యర్థిత్వానికి మద్దతు తెలిపిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ఈ సందర్భంగా లింగమనేని రమేష్ మాట్లాడుతూ.. “పవన్ కళ్యాణ్ నాకు ఒక పదవి ఇవ్వలేదు.. గొప్ప బాధ్యతను అప్పగించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడేలా పని చేస్తాను. సాధారణ పౌరుడి గొంతును రాజ్యసభలో వినిపించడమే నా లక్ష్యం. నాపై పవన్ కళ్యాణ్ ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు అంకితభావంతో పనిచేస్తాను” అని పేర్కొన్నారు.

Leave a Reply