రూ.28 లక్షల 97 వేల విలువైన ఎల్ ఓ సీ పత్రాలు అందజేత..

భవానిపురం, ఆంధ్రప్రభ : ఎమ్మెల్యే సుజనా చౌదరి సౌజన్యంతో ముఖ్యమంత్రి సహాయనిది నుండి మంజూరైన ఎల్ ఓ సీ (లెటర్ ఆఫ్ క్రెడిట్) లను శుక్రవారం ఎన్డీఏ కార్యాలయంలో మాజీ కార్పొరేటర్లు , కూటమి నేతలతో కలిసి కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ అందజేశారు. 52 వ వ డివిజన్ కంసాలి పేటకు చెందిన కొంగరపు దమయంతి (22) ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో శిశువుకు జన్మనిచ్చింది ప్రతికూల గర్భధారణ వలన శిశువు ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతూ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.. చిన్నారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులు తెలపడంతో చల్లం రాజు ట్రస్ట్ చైర్మన్ ముదిగొండ శివ ఎన్డీఏ కార్యాలయంలో వైద్యం సాయం కోసం దరఖాస్తు చేయగా మంజూరైన రూ 16 లక్షల 80 వేల విలువైన ఎల్ ఓ ను అందజేశారు..

42 వ డివిజన్ హెచ్ బీ కాలనీ కు చెందిన టీ రాజ్యలక్ష్మి కిడ్నీ స్టోన్స్ తో బాధపడుతూ మెరుగైన వైద్యం కోసం దరఖాస్తు చేసుకోగా మంజూరైన రూ 3 లక్షల 32 వేల విలువైన ఎల్ ఓ సీ ను అందజేశారు. 46 వ డివిజన్ లంబాడీ పేటకు చెందిన టీ జ్యోతి (39) హృద్రోగం తో బాధపడుతూ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులు తెలపడంతో టీడీపీ నాయకులు గుర్రం కొండ ఎన్డీఏ కార్యాలయంలో వైద్యం సాయం కోసం దరఖాస్తు చేసుకోగా మంజూరైన రూ 5 లక్షల 90 వేల విలువైన ఎల్ ఓ సీ ను అందజేశారు. 40 వ డివిజన్ గాంధీ బొమ్మ ప్రాంతానికి చెందిన ఉడుముల సావిత్రి (42) గర్భాశయ సమస్యతో బాధపడుతూ శస్ర చికిత్స కోసం దరఖాస్తు చేసుకోగా మంజూరైన రూ 2 లక్షల 90 వేల విలువైన ఎల్ ఓ సీ ను అందజేశారు..త్వరితగతిన స్పందించి
ఎల్ ఓ సీ లను అందజేయడంతో బాధితుడి కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే సుజనా చౌదరి కు కృతజ్ఞతలు తెలిపారు. మాజీ కార్పొరేటర్లు మరుపిళ్ళ రాజేష్, మహాదేవు అప్పాజీరావు, అత్తలూరి ఆదిలక్ష్మీ పెదబాబు, మహ్మద్ అబ్దుల్ ఖాదర్, బీజేపీ నేతలు నున్న కృష్ణ, దుర్బేసుల హుస్సేన్, బెన్నా భక్తుల, సోమేశ్వరరావు చల్లం రాజు ట్రస్ట్ చైర్మన్ ముదిగొండ శివ, టీడీపీ నేతలు పచ్చవ మల్లికార్జున, చుక్కా నరేష్ ,ధనాల శ్రీనివాసరావు, కోటేశ్వరరావు జనసేన నేతలు బొమ్ము గోవింద లక్ష్మీ, తిరుపతి అనూష, బొల్లేపల్లి కోటేశ్వరరావు పాల్గొన్నారు..

Leave a Reply