కుంగిన చెరువు కట్టకు తక్షణ మరమ్మతులు చేపట్టాలి
కుంగిన చెరువు కట్టకు తక్షణ మరమ్మతులు చేపట్టాలి
- సీపీఐ నిరసన
మోత్కూర్, ఆంధ్రప్రభ : మోత్కూరు మున్సిపల్ కేంద్రంలోని కుంగిన చెరువు కట్ట (మినీ ట్యాంక్ బండ్)కు తక్షణమే మరమ్మతులు చేపట్టాలని కోరుతూ సిపిఐ పట్టణ శాఖ ఆధ్వర్యంలో కుంగిన చెరువు కట్టను పరిశీలించి, పార్టీ జెండాలతో నిరసన తెలిపారు. గత వర్షాకాలంలో కుంగిన చెరువు కట్టను ఈ వర్షాకాలం సమీపిస్తున్న ఇంతవరకు ఎలాంటి మరమ్మతులు చేయకపోవడం బాధాకరమని సిపిఐ పార్టీ మండల కార్యదర్శి అన్నెపు వెంకట్ ప్రభుత్వాన్ని, అధికారులను ప్రశ్నించారు.
ఈ చెరువు కట్ట మీద నుండి అనేక వాహనాలు, బైకులు వందలాది బస్సులు వెళ్తున్నప్పటికి, కుంగిన చెరువు కట్టను మరమ్మతు చేయకపోతే పెద్ద ఎత్తున ప్రమాదం, ప్రాణాపాయం జరిగే అవకాశం ఉందని ఇప్పటికైనా ప్రభుత్వం ,అధికారులు స్పందించి తక్షణమే కుంగిన చెరువు కట్టకు మరమ్మతులను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో గీత పనివారల సంఘం జిల్లా అధ్యక్షుడు చాపల అంజయ్య , మోత్కూర్ మండల సహాయ కార్యదర్శి, పులకరం మల్లేష్ ,పట్టణ సహాయ కార్యదర్శి, గొలుసులు యాదగిరి, బీసీ సంఘం మండల కార్యదర్శి పెండెం వెంకటేశ్వర్లు ,నిల్గొండ అశోక్, బొడ్డుపల్లి వెంకన్న, కడమంచి వీరస్వామి, సీనియర్ నాయకులు తాడూరు లక్ష్మీనరసయ్య, ఎడ్ల ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.
