రైతులు పంట మార్పిడిపై దృష్టి పెట్టాలి: ఎంపీడీవో వేణుగోపాల్ రెడ్డి
రైతులు పంట మార్పిడిపై దృష్టి పెట్టాలి: ఎంపీడీవో వేణుగోపాల్ రెడ్డి
మరిపెడ, ఆంధ్రప్రభ:
ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా అబ్బాయిపాలెం, ధరావత్ తండా, అమృ నాయక్ తండా, ఎల్లారిగూడెం గ్రామపంచాయతీల్లో నిర్వహించిన ప్రత్యేక గ్రామసభల్లో ఎంపీడీవో వేణుగోపాల్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు పంట మార్పిడి పద్ధతులను అనుసరించాలని, అంతర పంటల సాగుపై దృష్టి పెట్టాలని సూచించారు.
గ్రామాల్లో చెత్త సేకరణ, పారిశుద్ధ్య మెరుగుదల, బాల్య వివాహాల నిర్మూలన, మాదకద్రవ్యాల నివారణపై ప్రజలకు అవగాహన కలిగి ఉండాలని అన్నారు. మహిళల భద్రత, రోడ్డు భద్రత, విద్యుత్ సమస్యలు, తాగునీటి సరఫరా, మహిళా-శిశు సంక్షేమం, ఓటరు నమోదు, ఓటరు జాబితా సవరణ ప్రక్రియలపై అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో మిషన్ భగీరథ సిబ్బంది పుష్పలత, గ్రామ సర్పంచులు బోడ సోములు, ధరావత్ తేజ, ధరావత్ పద్మ, బానోత్ శాంతి, పంచాయతీ కార్యదర్శులు ముజాఫర్, వినోద్ కుమార్, విప్లవ, నాజియా తదితరులు పాల్గొన్నారు.
