BJP | రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ..

BJP | రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ..

  • పలు రాష్ట్రాలకు కొత్త ముఖాలకు అవకాశం

రాబోయే రాజ్యసభ ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తన అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. అరుణాచల్ ప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్, మణిపూర్, రాజస్థాన్, ఒడిశా రాష్ట్రాలకు చెందిన అభ్యర్థుల పేర్లను పార్టీ ఖరారు చేసింది.

అరుణాచల్ ప్రదేశ్ నుంచి తాయ్ తాగాక్‌ను రాజ్యసభ అభ్యర్థిగా బీజేపీ ప్రకటించింది. గుజరాత్ నుంచి రాజూభాయ్ శుక్లా, ముకేశ్‌భాయ్ రాఠ్వా, మాన్సింగ్ పరమార్, జితేంద్ర మేఘ్‌జీభాయ్ కంజారియా పేర్లను ఖరారు చేసింది. మధ్యప్రదేశ్ నుంచి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుఘ్‌కి అవకాశం కల్పించింది. మణిపూర్ నుంచి ఏ. శారదా దేవిని అభ్యర్థిగా ఎంపిక చేసింది.

రాజస్థాన్‌లో రెండు స్థానాలకు డాక్టర్ అల్కా గుర్జార్, డాక్టర్ సతీష్ పూనియాలను అభ్యర్థులుగా ప్రకటించారు. ఈ పేర్లు కొన్ని రోజులుగా బీజేపీ వర్గాల్లో ప్రధానంగా వినిపిస్తున్నాయి.

ఒడిశా నుంచి దేవాశిష్ సామంతరాయ్‌కు పార్టీ రాజ్యసభ టికెట్ కేటాయించింది. ఆయా రాష్ట్రాల్లో పార్టీ బలాబలాలను దృష్టిలో ఉంచుకుని బీజేపీ ఈ ఎంపికలు చేసినట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

Leave a Reply