Global Star | ఎన్టీఆర్ ట్వీట్‌తో సోషల్ మీడియాలో హంగామా!

Global Star | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్‌ : దర్శకుడు ప్రశాంత్ నీల్ పుట్టినరోజు సందర్భంగా గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. వీరిద్దరి క్రేజీ కాంబినేషన్‌లో ‘డ్రాగన్’ అనే భారీ యాక్షన్ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

ఈ రోజు ప్రశాంత్ నీల్ బర్త్‌డే కావడంతో ‘మ్యాన్ ఆఫ్ మాసెస్’ జూనియర్ ఎన్టీఆర్ ఆయనకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. “డైరెక్టర్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు… మీరు చెప్పే కథలంత గ్రాండ్‌గా ఈ సంవత్సరం మీకు ఉండాలని ఆశిస్తున్నాను. ప్రశాంత్… మన కాంబినేషన్ కోసం, మన ముందుకు రాబోయే ఆ క్రేజీ ప్రాజెక్ట్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాను!” అని ఎన్టీఆర్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పటి నుంచే నందమూరి అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఇటీవలే విడుదలైన టీజర్‌తో ప్రశాంత్ నీల్ తన ‘డ్రాగన్’ ప్రపంచాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసి అందరినీ మెప్పించారు. నీల్ మార్క్ మాస్ ఎలివేషన్స్, ఎన్టీఆర్ పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్ తోడైతే బాక్సాఫీస్ రికార్డులు బద్దలవడం ఖాయమని ఇండస్ట్రీ వర్గాలు బలంగా భావిస్తున్నాయి.

Leave a Reply