మాజీ మంత్రి హరీష్ రావును కలిసిన రాజేష్ ..
చిట్యాల, ఆంధ్రప్రభ : మండలంలోని చల్లగరిగేకు చెందిన కేయూ రజక విద్యార్థి విభాగం ఇన్చార్జి, కోరపల్లి రాజేష్, మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే ,తన్నీరు హరీష్ రావు జన్మదినం సందర్భంగా బుధవారం మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు . తెలంగాణ ఉద్యమంలో ముఖ్య భూమిక పోషించి, బి ఆర్ఎస్ పదేండ్ల పాలనలో రాష్ట్ర అభివృద్ధికి ఆర్థిక శాఖ మంత్రిగా పని చేసిన నేత హరీష్ రావు అన్నారు. ప్రజా సంక్షేమాన్ని విస్మరించిన ప్రజా పాలన కాంగ్రెస్ ప్రభుత్వానికి రానున్న రోజుల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్తారన్నారు.
