Railway I వేసవి రద్దీకి చెక్.. విజయవాడ మీదుగా స్పెషల్ ట్రైన్స్
Railway I వేసవి రద్దీకి చెక్.. విజయవాడ మీదుగా స్పెషల్ ట్రైన్స్
Railway I విజయవాడ, ఆంధ్రప్రభ: వేసవి సెలవుల నేపథ్యంలో పెరిగిన ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు భారతీయ రైల్వే ప్రత్యేక వన్‌వే రైళ్లను నడపనుంది. జూన్ 4న గువాహటి–తిరుపతి, రంగపారా నార్త్–విజయవాడ మధ్య రెండు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్లు దక్షిణ కోస్తా రైల్వే విజయవాడ డివిజన్ ప్రకటించింది.
రైలు నంబర్ 05630 గువాహటి–తిరుపతి ప్రత్యేక రైలు జూన్ 4న ఉదయం 7.20 గంటలకు గువాహటి నుంచి బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 8.40 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది. ఈ రైలు కామాఖ్య, రంగియా, బార్పేటా రోడ్, న్యూ బొంగైగావ్, కోక్రాజార్, న్యూ అలిపుర్దువార్, న్యూ కూచ్‌బెహార్, న్యూ జల్పైగురి, కిషన్‌గంజ్, బర్సోయ్, మాల్దా టౌన్, రాంపూర్ హాట్, బోల్పూర్ శాంతినికేతన్, డంకుని, ఆండుల్, ఖరగ్‌పూర్, బాలాసోర్, భద్రక్, జాజ్‌పూర్ రోడ్, కటక్, భువనేశ్వర్, ఖుర్దా రోడ్, బెర్హంపూర్, పలాస, శ్రీకాకుళం రోడ్, విజయనగరం, సింహాచలం నార్త్, దువ్వాడ, రాజమండ్రి, విజయవాడ, ఒంగోలు, గూడూరు, రేణిగుంట స్టేషన్లలో ఆగుతుంది.
అలాగే రైలు నంబర్ 05862 రంగపారా నార్త్–విజయవాడ ప్రత్యేక రైలు జూన్ 4న సాయంత్రం 4 గంటలకు రంగపారా నార్త్ నుంచి బయలుదేరి, మరుసటి రోజు మధ్యాహ్నం 3 గంటలకు విజయవాడకు చేరుకుంటుంది. ఈ రైలు ఉదల్‌గురి, రంగియా, బార్పేటా రోడ్, న్యూ బొంగైగావ్, కోక్రాజార్, న్యూ కూచ్‌బెహార్, న్యూ జల్పైగురి, అలువాబారి రోడ్, కిషన్‌గంజ్, మాల్దా టౌన్, రాంపూర్ హాట్, బోల్పూర్ శాంతినికేతన్, బర్దమాన్, డంకుని, ఆండుల్, ఖరగ్‌పూర్, బాలాసోర్, భద్రక్, జాజ్‌పూర్ రోడ్, నరాజ్ మరతాపూర్, భువనేశ్వర్, ఖుర్దా రోడ్, బలుగావ్, బెర్హంపూర్, పలాస, శ్రీకాకుళం రోడ్, విజయనగరం, కొత్తవలస, దువ్వాడ, అనకాపల్లి, ఎలమంచిలి, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు స్టేషన్లలో ఆగనుంది.
ఈ రెండు ప్రత్యేక రైళ్లలో త్రీ ఏసీ, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు అందుబాటులో ఉంటాయని రైల్వే అధికారులు తెలిపారు. వేసవి రద్దీ కారణంగా ప్రయాణికులు ఈ ప్రత్యేక రైళ్లను వినియోగించుకోవాలని సూచించారు.
