సముద్రాల కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి తుమ్మల..

ఖమ్మం, ఆంధ్రప్రభ : ఖమ్మం కాంగ్రెస్ నాయకుడు సముద్రాల శ్రీనివాసరావు తండ్రి సముద్రాల సూర్యనారాయణ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బుధవారం ఖమ్మం నగరంలోని 3 టౌన్ పరిధిలోని ప్రకాశ్‌నగర్‌లో ఉన్న వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

ఈ సందర్భంగా సముద్రాల శ్రీనివాసరావు, సముద్రాల సత్యనారాయణతో పాటు కుటుంబ సభ్యులను ఓదార్చి, సముద్రాల సూర్యనారాయణ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మృతి చెందిన సమయంలో ఇతర కార్యక్రమాల కారణంగా అందుబాటులో లేకపోవడంతో వెంటనే హాజరు కాలేకపోయానని మంత్రి తెలిపారు.

మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు సుడా చైర్మన్ పువ్వాళ్ల దుర్గాప్రసాద్, ఖమ్మం నగర కాంగ్రెస్ అధ్యక్షుడు నాగండ్ల దీపక్ చౌదరి, 3 టౌన్ బి-బ్లాక్ అధ్యక్షుడు బాల గంగాధర్ తిలక్, తోట వీరభద్రం, కలిమెల భద్రయ్య, కొప్పెర ఉపేందర్, గజ్జెల వెంకన్న, పత్తికొండ శ్రీనివాస్, కలిమెల శ్రీనివాసరావు, జెట్టి లింగరాజు, బాణాల లక్ష్మణ్, కోదుమూరి మధు, ఉపేందర్ (లక్కీ), కోనేటి నారాయణ తదితర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply