Cabinet | తెలంగాణకు కేంద్రం గుడ్న్యూస్.. రూ.7,597 కోట్లతో హైవేల విస్తరణ
- Cabinet | తెలంగాణకు కేంద్రం గుడ్న్యూస్.. రూ.7,597 కోట్లతో హైవేల విస్తరణ
న్యూఢిల్లీ: తెలంగాణలో రహదారి మౌలిక వసతుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం భారీ ఊతమిచ్చింది. అర్మూర్-జగిత్యాల-మంచిర్యాల, జగిత్యాల-కరీంనగర్ జాతీయ రహదారులను నాలుగు లేన్లుగా విస్తరించే ప్రాజెక్టుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో రూ.7,597 కోట్ల అంచనా వ్యయంతో 190.76 కిలోమీటర్ల మేర ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ లభించింది.
ఈ విస్తరణ పూర్తయితే నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, మంచిర్యాల జిల్లాల మధ్య రాకపోకలు మరింత సులభతరం కానున్నాయి. ప్రయాణ సమయం గణనీయంగా తగ్గడంతో పాటు ట్రాఫిక్ సమస్యలు కూడా తగ్గనున్నాయి. దీనివల్ల ట్రాఫిక్ సమస్యలు తగ్గడమే కాకుండా, అంతర్రాష్ట్ర రవాణా మరింత సులభతరం కానుంది.
