విద్యుత్ ఘాతంతో ఆవు మృతి..

ఉట్నూర్, ఆంధ్రప్రభ : ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని ఏంద గ్రామానికి చెందిన గిరిజన రైతు జాదవ్ ఉత్తం ఆవు విద్యుత్ ఘాతానికి గురై మృతి చెందినట్లు ఆ రైతు బంధువులు తెలిపారు. ఆ గ్రామ సమీపంలోని చాలా కిందికి ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫారం వైపు ఆవు మేతకు వెళ్లి విద్యుత్ ఘాతకానికి గురై మృతి చెందిందని తెలిపారు. ఆవు మృతితో 40 వేలకు పైగా విలువగల అవును కోల్పోయామని ఆ రైతు ఆవేదన వ్యక్తం చేశారని ఆయన బంధువులు తెలిపారు.

ఇండ్లకు సమీపంలో ఉన్న ట్రాన్స్ఫారం చాలా కిందకు ఉండడం వల్ల దాని చుట్టూ కంచ లేకపోవడం వల్ల ఆవు మృతి చెందిందని వారు తెలిపారు. విద్యుత్ శాఖ అధికారులు చాలా కిందకు ఉన్న ట్రాన్స్ఫారంకు కంచ ఏర్పాటు చేయాలని ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని, విద్యుత్ షాక్ తో ఆవు మృతి చెందిన కారణంగా విద్యుత్ శాఖ ద్వారా ఆ బాధిత రైతుకు ఆర్థిక సహాయం అందించేలా చూడాలని బాధిత రైతు బంధువులు కోరారు.

Leave a Reply