జూన్ 7 మహాసభలను విజయవంతం చేయాలి

జూన్ 7 మహాసభలను విజయవంతం చేయాలి

  • కార్మికులకు బిఎంఎస్ నాయకుల పిలుపు

భూపాలపల్లి రూరల్ , ఆంధ్రప్రభ : సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్ (బీఎంఎస్) ఆధ్వర్యంలో ఈ నెల 7న భూపాలపల్లిలో నిర్వహించనున్న 29వ ద్వైవార్షిక మహాసభలను విజయవంతం చేయాలని సంఘం నాయకులు కార్మికులకు పిలుపునిచ్చారు. బుధవారం కేటీకే-1 ఇంక్లైన్ వద్ద నిర్వహించిన సమావేశంలో బీఎంఎస్ అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ అప్పాని శ్రీనివాస్ మాట్లాడారు. సింగరేణి కార్మికులకు కోల్ ఇండియా తరహాలో అలవెన్సులపై ఆదాయపు పన్ను రీయింబర్స్‌మెంట్ చెల్లించాలని, రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన విద్యుత్ బొగ్గు బకాయిలను సింగరేణికి వెంటనే చెల్లించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

12వ వేజ్ బోర్డు అమలుకు సంబంధించి వెంటనే కమిటీ ఏర్పాటు నోటిఫికేషన్ జారీ చేయాలని కోరారు. సింగరేణిలో రాజకీయ జోక్యాన్ని నివారించడం, కొత్త గనుల ప్రారంభం, కార్పొరేట్ మెడికల్ బోర్డు కొనసాగింపు, తొలగించిన కార్మికులకు మరో అవకాశం కల్పించడం, కాంట్రాక్ట్ కార్మికులకు కోల్ ఇండియా తరహా ఐపవర్ కమిటీ వేతనాలు అమలు చేయడం వంటి అంశాలపై మహాసభల్లో కార్యాచరణ రూపొందించనున్నట్లు తెలిపారు. సమావేశంలో కేంద్ర కమిటీ నాయకులు, శాఖ కార్యదర్శులు, కార్మికులు పాల్గొన్నారు.

Leave a Reply