మోటార్ స్విచ్ వేస్తుండగా విద్యుత్‌ఘాతం

మోటార్ స్విచ్ వేస్తుండగా విద్యుత్‌ఘాతం

జరుగువానిపాలెంలో మహిళ మృతి.. కుటుంబంలో విషాదం

కోడూరు, ఆంధ్రప్రభ: కోడూరు మండలం లింగారెడ్డిపాలెం పంచాయతీ పరిధిలోని జరుగువానిపాలెం గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. మోటార్ స్విచ్ వేస్తుండగా విద్యుత్‌ఘాతానికి గురై మహిళ మృతి చెందింది. గ్రామానికి చెందిన దాసరి కృష్ణకుమారి (67) మోటార్ స్విచ్ వేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.

మృతురాలి భర్త అనారోగ్యంతో మంచానికే పరిమితమై ఉన్నట్లు గ్రామస్థులు చెప్పారు. కృష్ణకుమారికి ముగ్గురు కుమార్తెలు ఉన్నట్లు తెలిపారు. ఆమె మృతితో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు విషాదంలో మునిగిపోయారు.

Leave a Reply