Pawan-Strong-Warning ఇవి తాటాకు చప్పుళ్లు Andhra Prabha Top News
Pawan-Strong-Warning ఇవి తాటాకు చప్పుళ్లు Andhra Prabha Top News
- నాలుక కోస్తాం.. పీకలు కోస్తాం.. ఈ బెదిరింపులకు
- అదరం బెదరం
- బాంచన్ దొర అంటూ
- కాల్మొక్కే నైజం కాదు
- తెలంగాణాలో జనసేన పోదు
- తడఖా చూపిస్తాంజనసేన అధినేత.. ఏపీ డిప్యూటీ సీఎం సవన్ కళ్యాణ్
( ఆంధ్ప్రభ, న్యూస్ నెట్ వర్క్ )

బాంచన్ దొర కాల్మొక్త నై.జం కాదు, అదిరింపులు, బెదిరింపులకు. తాటాకు చప్పుళ్లకు భయపడే తత్వం కాదు. తెలంగాణలో జనశక్తి ఉంటుంది. ప్రజల కోసం పోరాడుతుంది, అని జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్సష్టం చేశారు. తెలంగాణాలో తిరగనివ్వం అని బెదిరించిన రాజకీయ పార్టీలను తూర్పారబట్టారు. ముఖ్యంగా వేర్పాటు వాదాని తిప్పికొట్టారు. దేశ సమగ్రతను దెబ్బతీసే ఈ విభజన వాదం… ఉగ్రవాదం కంటే ప్రమాదం అని హెచ్చరించారు. ఎన్ని బెదిరింపులు వచ్చినా.. జన సేన తెలంగాణ నుంచి కదలదని సూటిగా చెప్పారు. తెలంగాణ ఆవిన్భావ దినోత్సవం సందర్భంగా… హైదరాబాద్ లో జనసేన పార్టీ తలపెట్టిన తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ – జనసేన సాధక్ సమ్మేళనం నిర్వహణకు అనుమతి నిరాకరించటంతో… మంగళవారం సాయంత్రం ఆయన జూబ్లీహిల్స్ లోని తన ఇంటిలో విలేఖరుల సమావేశం నిర్వహించారు.. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ప్రస్తావించిన అనేక కీలక అంశాలు పరిశీలిద్దాం.
Pawan-Strong-Warning తెలంగాణకు వ్యతిరేకం కాదు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనకు వ్యతిరేకం కాదు. విభజన జరిగిన తీరుకే వ్యతిరేకం. పార్లమెంటులో తలుపులు వేసి రాష్ట్రాన్ని విభజించిన వైఖరిని వ్యతిరేకించాను. 2007లోనే తెలంగాణలో తిరిగాను. ఆదిబాబాద్ జిల్లాల్లో గోండుల వ్యథలు తెలుసుకున్నాను. తాగునీటి సమస్య పరిష్కారానికి తాండాల్లో బోర్లు వేయించాను. ఓట్ల కోసం, అధికారం కోసం ఈ పని చేయలేదు. తెలంగాణ అంటే ఇష్టం. తెలంగాణ అంటే అభిమానం. తెలంగాణ పై అత్యంత ప్రేమ. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదు.
Pawan-Strong-Warning ఎన్నో అవమానాలు భరించా

ఆంధ్రావోడు.. అని తిట్టినా భరించా. మహబూబ్ నగర్, ఖమ్మం జిల్లాలో దాడి చేసినా సహించా . ఇప్పుడు తెలంగాణాలో అడుగు పెట్టనీయం అని హూంకరిస్తే బెదిరేది లేదు. నాలుక కోసం, పీక కోస్తాం, అని భయపెడితే బాంబన దొర అంటూ పక్కకు పోయేది లేదు. ఆంధ్రా, తెలంగాణ ప్రజల మధ్య విద్వేషాలు లేవు. అక్కడ ఇక్కడ ప్రజల మధ్య ప్రేమానురాగాలు ఉన్నాయి. ఇక్కడి కాంట్రాక్టరు ఏపీలో… ఏపీ కాంట్రాక్టరు తెలంగాణాలో బాగానే ఉన్నారు. ఎవరి వ్యాపారాలు వాళ్లు బాగానే చేసుకొంటున్నారు. కానీ రాజకీయ నాయకులే.. విద్వేషాలు సృష్టిస్తున్నారు. అని జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు.
Pawan-Strong-Warning వీళ్లంతా ఏమయ్యారు

వైఎస్ రాజశేఖరరెడ్డి రాష్ట విభజను వ్యతిరేకించారు. అప్పుడు ఈ నాయకుంతా ఏమయ్యారు. ఒక్కళ్లంటే ఒక్కడు మాట్లాడలేదు. ఇప్పుడు వీళ్లకి తెలంగాపై ప్రేమ పుట్టుకొచ్చిందా? రాష్ట్రం విడిపోయిన తరువాత.. తెలంగాణలోని ఏ పార్టీ నాయకుడిని విమర్శించలేదు. అధికారంలోని కేసీఆర్ ను ఏనాడు ఏమాటా అనలేదు. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గురించి మాట్లాడలేదు. ఆయన అంటే నాకు గౌరవం. కానీ కొందరు నాయకుల వల్లే ఈ గోడవ జరుగుతోంది. ఓ కాంగ్రెస్ నాయకుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఇది పద్దతి కాదు. తెలంగాణాలో తిరగనీయం అంటున్నాడు. తెలంగాణ ఆ నాయకుడి అయ్య జాగీరా అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు.
Pawan-Strong-Warning ఏపీలో బీఆర్ఎస్ ని స్వాగతించాం
వీళ్లు ఎక్కడి పడితే అక్కడ పార్టీలు స్థాపించుకోవచ్చు. పం.జాబ్ పోవచ్చు. తమిళనాడు పోవచ్చు. కేరళలో కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక పోటీ చేయవచ్చు. మెదక్ లో ఇందిరా గాంధీ ఎంపీ కావొచ్చు. నంద్యాలలో పీవీ నరసిహారావు పోటీ చేయవచ్చు. కానీ జనసేన మాత్రం తెలంగాణాలో ఉండకూడదు. ఇదేం నీతి. దేశంలో ఎకడికైనా వెళ్లొచ్చు, బతకొచ్చు. మహారాష్ట్రాలో, నాగ్పూర్ లో… షోలాపూర్ లో బతుకు తెరువు కోసం తెలుగు ప్రజలు వెళ్లారు. అక్కడ కూడా స్థానికులు గొడవ పడితే ఏం జరుగుతుంది? నేను భారతీయుడ్ని. భారత దేశ సమగ్రతను దెబ్బతీస్తే సహించను. అని ఆవేశంగా పవన్ కళ్యాఫ్ గర్జించారు.
Pawan-Strong-Warning కబ్జా నిజమైతే.. తీసుకోండి

నాకు గోశాల ఉంది. అది కబ్జా కాదు. నిజంగా కబ్జా అని తేలితే ప్రభుత్వానికి ఇచ్చేస్తా. కబ్జా ఓ నేరం. కేసు పెట్టి విచారించవచ్చు. ఇప్పటికైనా ప్రభుత్వం చర్య తీసుకోవచ్చు. ప్రాంతీయ విభేదాలతో పబ్బం గడపొద్దు. నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజల్లో లక్షమంది జనసైనికులు ఉన్నారు. వీరంటే ఎందుకు భయం. నిజాన్ని ప్రశ్నిస్తారు. ఇద్దరు కుర్రోళ్లు వచ్చి యురేనియం సమస్యనువివరిస్తే.. పోరాటం చేశాను. ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ ప్రశ్నిస్తా. అందుకే భయం. ఇక జన సేన ఆగదు. తెలంగాణలో జనం దగ్గరకు వెళ్తుంది. ఎవరు పిలిచనినా వెళ్తాం. గొడవలు పెట్టటానికి కాదు, సమస్య పరిష్కారం కోసం వెళ్తాం. అని పవన కళ్యాణ్ వివరించారు. తెలంగాణాలో రాజకీయ పార్టీలు ఎందుకు భయపడుతున్నాయి. అధికారం కోసం వస్తానా? ఏపీలో సీఎంగా గెలవలేదు. ఇక్కడ ఎలా గెలుస్తా? కానీ జనం కోసం పోరాడుతా. అందుకే వీళ్లకు భయం అని పవన్ కళ్యాణ్ అన్నారు.
ALSO READ : History Survey : నల్లమలలో హిస్టరీ సర్వే Andhra Prabha Top News
