Condolences | నా ప్రియ మిత్రుడిని కోల్పోయా.. ప్రధాని మోదీ భావోద్వేగం
Condolences | నా ప్రియ మిత్రుడిని కోల్పోయా.. ప్రధాని మోదీ భావోద్వేగం
గుజరాత్ శాసనసభ సీనియర్ సభ్యుడు, ఎనిమిది సార్లు బీజేపీ ఎమ్మెల్యేగా విజయం సాధించిన యోగేష్భాయ్ పటేల్ మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి, విచారం వ్యక్తం చేశారు. ఆయన మరణంపై ప్రధాని మోదీ సాషల్ మీడియా వేదికగా స్పందిస్తూ, తన పబ్లిక్ లైఫ్లో ఒక విశిష్టమైన సహచరుడిని కోల్పోయానని భావోద్వేగానికి లోనయ్యారు.
“గుజరాత్ శాసనసభ సీనియర్ సభ్యులు యోగేష్భాయ్ పటేల్ గారి మరణవార్త నన్ను తీవ్రంగా కలచివేసింది. ఆయన మరణంతో నా ప్రజా జీవితంలో ఒక ప్రత్యేకమైన సహచరుడిని నేను కోల్పోయాను. యోగేష్భాయ్ అన్ని కోణాల్లోనూ నిజమైన ప్రజా నాయకుడు. ప్రజల సమస్యలను ఎల్లప్పుడూ పూర్తి సమగ్రతతో, సున్నితత్వంతో, అంకితభావంతో వినిపించేవారు” అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
ఆయన పవిత్ర ఆత్మకు నిత్య శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్టు మోదీ తెలిపారు. గుజరాత్ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన యోగేష్ పటేల్ మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు కూడా సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
