Delhi | కుప్పకూలిన ఐదు అంతస్తుల భవనం..

Delhi | కుప్పకూలిన ఐదు అంతస్తుల భవనం..

దేశ రాజధాని ఢిల్లీలో శనివారం రాత్రి ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. దక్షిణ ఢిల్లీలోని మెహ్రౌలీ పోలీస్ స్టేషన్ పరిధిలోని సైదులాజాబ్‌ ప్రాంతంలో ఉన్న ఒక ఐదు అంతస్తుల నివాస భవనం అకస్మాత్తుగా కుప్పకూలిపోయింది. దీంతో ఆ ప్రాంతమంతా భయాందోళనలతో అల్లకల్లోలంగా మారింది.

సమాచారం అందిన వెంటనే ఢిల్లీ ఫైర్ సర్వీస్ (DFS) సిబ్బంది, స్థానిక పోలీసులు, విపత్తు నిర్వహణ బృందాలు రంగంలోకి దిగి యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాయి. ఇప్పటివరకు పులువురిని ప్రాణాలతో రక్షించి ఆసుపత్రికి తరలించగా, శిథిలాల కింద మరికొంతమంది చిక్కుకుని ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. ప్రమాద స్థలంలో అంబులెన్స్‌లను సిద్ధంగా ఉంచి, సహాయక చర్యలను మరింత ముమ్మరం చేశారు. భవనం కూలడానికి గల పూర్తి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Leave a Reply