పలువురు ఏఈఓల బదిలీలు..

పలువురు ఏఈఓల బదిలీలు..

జన్నారం,ఆంధ్రప్రభ: సాధారణ బదిలీలలో భాగంగా జన్నారం మండలంలోని పలు క్లష్టర్లలో పనిచేస్తున్న పలువురు ఏఈఓలను రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్ బదిలీ చేస్తూ, శనివారం సాయంత్రం లోపు విధుల్లో చేరాలని ఆదేశించారు.మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని కవ్వాల క్లస్టర్ ఏఈఓ సయ్యద్ అక్రముల్లను సింగరాయిపేట క్లస్టర్ కు బదిలీ చేశారు.అతని స్థానంలో జైపూర్ మండలం నుంచి ఏఈఓ అఖిల్ నాయక్ ను నియమించారు. జన్నారం ఏఈఓగా పనిచేసిన మల్యాల త్రీసంధ్యను కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని వాంకిడి మండలంలోని సాంగ్వి క్లస్టర్ కు బదిలీ చేశారు.ఆమె స్థానంలో పెద్దపెల్లి ఏఈఓ అఖిలను నియమించారు. సింగరాయిపేట క్లస్టర్ ఏఈఓ ఈనకొండ సాయిని దండేపల్లి మండలంలోని వెల్గనూరు క్లస్టర్ కు బదిలీ చేశారు. వీరందరు శనివారం విధుల్లో చేరారు.

Leave a Reply