Painting | పనిలో ఉండగానే జరిగిన ఘోరం

Painting | పనిలో ఉండగానే జరిగిన ఘోరం
Painting | ఎమ్మిగనూరు టౌన్, ఆంధ్రప్రభ: ఎమ్మిగనూరు పట్టణంలోని హెచ్బీఎస్ కాలనీలో నిర్మాణంలో ఉన్న వి ఫోర్ హోమ్స్ అపార్ట్మెంట్లో పెయింటింగ్ పని చేస్తున్న వ్యక్తి ప్రమాదవశాత్తు మృతి చెందాడు.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, మంత్రాలయం మండలం బూదూరు గ్రామానికి చెందిన పరమేశ్వర్ రెడ్డి (50) ఎమ్మిగనూరులోని బాలాజీ కన్స్ట్రక్షన్స్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న వి ఫోర్ హోమ్స్ అపార్ట్మెంట్లో పెయింటింగ్ పనులు చేస్తున్నాడు. ఐదు అంతస్తుల ఈ గృహ సముదాయంలో గత కొన్ని రోజులుగా విధులు నిర్వర్తిస్తున్నాడు.
శనివారం మూడో అంతస్తు వద్ద జూలా (సస్పెండెడ్ ప్లాట్ఫామ్)పై పనిచేస్తున్న సమయంలో అది ఒక్కసారిగా ఒరిగిపోవడంతో ప్రమాదం జరిగినట్లు సమాచారం. తీవ్రంగా గాయపడిన పరమేశ్వర్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిసింది.
ప్రమాద సమయంలో అవసరమైన భద్రతా పరికరాలు వినియోగించారా లేదా అనే అంశంపై కూడా చర్చ జరుగుతోంది. నిర్మాణ పనుల్లో కార్మికుల భద్రతకు సంబంధించిన నిబంధనలు పాటించబడిన విషయంపై అధికారులు విచారణ చేపట్టనున్నారు.
సమాచారం అందుకున్న పట్టణ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
