ప్రపంచ తెలుగు సాహిత్య మహాసభలకు “దండు శ్రీనివాస్”

ప్రపంచ తెలుగు సాహిత్య మహాసభలకు “దండు శ్రీనివాస్”

కేసముద్రం, ఆంధ్రప్రభ : కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలోని అమీనాపురం గ్రామానికి చెందిన వర్ధమాన కవి దండు శ్రీనివాస్ కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజమహేంద్రవరం (రాజమండ్రి )లో జూన్ నెల 6 , 7వ తేదిలలో జరగబోయే ప్రపంచ తెలుగు సాహిత్య మహాసభలకు ఆహ్వానం వచ్చింది అని ఒక ప్రకటన లో తెలియచేశారు. ఈ సందర్బంగా కవి దండు శ్రీనివాస్ మాట్లాడుతూ రాజమండ్రి లో జరిగే ప్రపంచ వేదిక లో వివిధ దేశాల నుండి కవులు, సాహిత్య విశ్లేషకులు, తెలుగు సాహిత్యం అవసోపానం పట్టిన దిగ్గజ కవులు,గజల్ కళాకారులూ ప్రతినిధులు పాల్గొంటారు అని, అలాంటి వేదిక పై నాకు అవకాశం రావడం సంతోషం గా వుంది అని తెలిపారు. ఇంతటి గొప్ప సువర్ణ అవకాశం కలిపించిన శ్రీ. శ్రీ. కళావేదిక నిర్వాహకులకు ఈ సందర్బంగా శ్రీనివాస్ ధన్యవాదాలు తెలిపారు.

Leave a Reply