APSRTC | టికెట్ ధరల పెంపుపై మంత్రి స్పష్టీకరణ

APSRTC | టికెట్ ధరల పెంపుపై మంత్రి స్పష్టీకరణ

APSRTC | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌ : ఆర్టీసీ టికెట్ ధరల పెంపు, సంస్థ ప్రైవేటీకరణపై వస్తున్న ప్రచారాలను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి ఖండించారు. ఆర్టీసీ ఆర్థికంగా బలంగా ఉందని, ప్రజల్లో అనవసర ఆందోళనలు సృష్టించేలా తప్పుడు ప్రచారం జరుగుతోందని అన్నారు.

డీజిల్ ధరలు పెరిగినప్పటికీ ప్రస్తుతం ఆర్టీసీ టికెట్ ఛార్జీలు పెంచే ప్రతిపాదన ప్రభుత్వం పరిశీలనలో లేదని మంత్రి స్పష్టం చేశారు. ప్రయాణికులపై అదనపు భారం మోపకుండా సంస్థను సమర్థవంతంగా నిర్వహించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

ఆర్టీసీకి రూ.25 వేల కోట్ల నుంచి రూ.30 వేల కోట్ల వరకు ఆస్తులు ఉన్నాయని మంత్రి వెల్లడించారు. సంస్థను ప్రైవేటీకరించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. త్వరలో 2,500 ఎలక్ట్రిక్ బస్సులు, 500 సీఎన్‌జీ బస్సులను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. అలాగే సంస్థలో అవసరమైన ఉద్యోగ ఖాళీలను కూడా దశలవారీగా భర్తీ చేస్తామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి వెల్లడించారు.

Leave a Reply