TiffanyTrump | ఎక్కడెక్కడికి వెళ్లనున్నారంటే?

TiffanyTrump | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె టిఫానీ ట్రంప్ భారత్ పర్యటనకు వచ్చారు. ఇది పూర్తిగా వ్యక్తిగత పర్యటన కావడంతో సమాచారం బయటకు వెల్లడి కాలేదు. శుక్రవారమే ఆమె భారత్‌కు చేరుకొని దిల్లీలోని అక్షర్‌ధామ్ ఆలయాన్ని సందర్శించారు. ఈ మేరకు చిత్రాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు.
పర్యటనలో భాగంగా ఆదివారం టిఫానీ ట్రంప్, ఆగ్రాకు వెళ్లనున్నారు. ప్రపంచంలోని అద్భుత కట్టడాల్లో ఒకటైన తాజ్ మహల్‌ను సందర్శించనున్నారు. అక్కడ నుంచి ఆమె రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో కూడా పర్యటించనున్నట్లు తెలుస్తుంది. ఇది ఆమె వ్యక్తిగత పర్యటన అయినప్పటికీ ముందు జాగ్రత్త చర్యలో భాగంగా అధికారులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. కాగా టిఫానీ, భారత కు రావడం ఇది తొలి సారి కాదు 2018లో అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ , భారత్ లో అధికారికంగా పర్యటించారు. అప్పుడు తండ్రితో పాటు టీఫాని ట్రంపు, కూడా ఇక్క డికి వచ్చారు. ఈమె ట్రంపు రెండో భార్య కుమార్తె.
click here to read ప్రపంచం అంతా వ్యతిరేకిస్తున్నా భారత్ అండ
