పట్టపగలే చోరీ. అసలు ఎలా జరిగింది…?

పట్టపగలే చోరీ. అసలు ఎలా జరిగింది…?

క్యాతన్ పల్లి, ఆంధ్రప్రభ : గద్దెరేగడి GRM టౌన్‌ షిప్‌లో పట్టపగలే చోరీ జరిగింది. గుర్తుతెలియని దుండగులు ఇంట్లోని గ్రిల్ తొలగించి 20 తులాల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… గద్దెరేగడికి చెందిన మహమ్మద్ అమీర్ ఖాన్ S/o బాబు ఖాన్ బుధవారం ఉదయం 11 గంటలకు ఇంటికి తాళం వేసి గోదావరిఖనిలోని తల్లిదండ్రుల ఇంటికి వెళ్లాడు. తిరిగి వచ్చి చూడగా ఇంటి ప్రధాన ద్వారం పక్కన ఉన్న గ్రిల్‌ను ఎవరో తొలగించి లోపలికి ప్రవేశించారు. బీరువాలో భద్రపరిచిన 20 తులాల బంగారు నగలు మాయమయ్యాయి.

వెంటనే అమీర్ ఖాన్ రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఘటనా స్థలానికి చేరుకున్న ACP బెల్లంపల్లి, మందమరి CI పరిసరాల్లోని CC కెమెరాలను పరిశీలించారు. నిందితులను పట్టుకునేందుకు 4 ప్రత్యేక పోలీస్ బృందాలను రంగంలోకి దించారు. దర్యాప్తు కొనసాగుతోందని ఎస్సై జాడి శ్రీధర్ తెలిపారు. పగటిపూటే ఇలా చోరీ జరగడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply