మతిస్థిమితం లేని వృద్ధురాలు మృతి

మతిస్థిమితం లేని వృద్ధురాలు మృతి

దండేపల్లి, ఆంధ్రప్రభ: దండేపల్లి మండల కేంద్రానికి చెందిన సాయిని లక్ష్మీ (80) అనే వృద్ధురాలు మృతి చెందినట్లు దండేపల్లి ఎస్సై తహసీనుద్దీన్ తెలిపారు.

ఎస్సై, కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం, సాయిని లక్ష్మీ మతిస్థిమితం లేక వారం రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయింది. కుటుంబ సభ్యులు బంధువుల ఇళ్లతో పాటు పరిసర ప్రాంతాల్లో వెతికినా ఆమె ఆచూకీ లభించలేదు. గతంలో కూడా ఆమె ఇలాగే ఇంటి నుంచి వెళ్లి తిరిగి వచ్చేదని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈసారి కూడా తిరిగి వస్తుందని భావించినట్లు చెప్పారు.

శుక్రవారం మండల కేంద్రంలోని ఎర్రకుంట చెరువు సమీపంలో లక్ష్మీ మృతదేహం కనిపించిందని గ్రామానికి చెందిన వ్యక్తి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే అక్కడికి వెళ్లి చూడగా ఆమె మృతి చెందినట్లు గుర్తించారు. తాగునీరు లేకపోవడం వల్లే తన తల్లి మృతి చెంది ఉండవచ్చని మృతురాలి కుమారుడు గంగన్న అనుమానం వ్యక్తం చేశాడు. గంగన్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తహసీనుద్దీన్ తెలిపారు.

Leave a Reply