సూరారం స్టేజి వద్ద ట్రాక్టర్ బీభత్సం

సూరారం స్టేజి వద్ద ట్రాక్టర్ బీభత్సం

ఎల్కతుర్తి, ఆంధ్రప్రభ: ఎల్కతుర్తి మండలంలోని సూరారం స్టేజి సమీపంలో శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ట్రాక్టర్ ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న టేకుమట్ల మల్లయ్య, ఆయన భార్య లక్ష్మి, ఎనిమిదేళ్ల చిన్నారి తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి 108 అత్యవసర వాహనానికి సమాచారం అందించారు.

క్షతగాత్రులను 108 వాహనంలో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply