డిస్కమ్ పరిధిలో గాలివాన ఎఫెక్ట్

డిస్కమ్ పరిధిలో గాలివాన ఎఫెక్ట్

-35 గ్రామాల్లో విద్యుత్ అంతరాయం
-24 గంటల్లో పునరుద్దరణ

తిరుపతి(రాయలసీమ ), ఆంధ్రప్రభ బ్యూరో :
ఆంధ్రప్రదేశ్ సదరన్ విద్యుత్ డిస్కమ్ పరిధిలో గత రాత్రి గాలి వాన కారణంగా కడప, నెల్లూరు జిల్లాల్లో విద్యుత్ వ్యవస్థలు దెబ్బతిన్నాయి. కడప జిల్లాలోని కొండాపురం, మైదుకూరు, మైలవరం, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు గ్రామీణ, దువ్వూరు, రాజుపాలెం, చాపాడు మండలాల్లోని 28 గ్రామాల్లోనూ, నెల్లూరు జిల్లాలోని కావాలి గ్రామీణ, కొండాపురం, కోవూరు, ముత్తుకూరు, జలదంకి, దగదర్తి, అల్లూరు మండలాల్లోని 15 గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఆ రెండు జిల్లాల్లో 26 ఫీడర్లు, 114 కి.మీ. మేరకు విద్యుత్ లైన్లు, 213 స్తంభాలు, 131 ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతిన్నాయి.

ఆ రెండు జిల్లాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడిన 19 మండలాల్లో విద్యుత్ సిబ్బంది యుద్ధ ప్రాతిపదికన పనిచేసి 24 గంటల్లో సరఫరా ను పునరుద్దరించి నట్టు , ఆయా సర్కిళ్ల సూపరింటెండింగ్ ఇంజనీర్ల పర్యవేక్షణలో విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది శుక్రవారం మధ్యాహ్నానికి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించినట్లు డిస్కమ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్ లోతేటి తెలిపారు

Leave a Reply