విజయవంతంగా ముగిసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రం..

లక్ష్మణచాంద, ఆంధ్రప్రభ : మండలంలోని చామన్ పల్లి గ్రామ డీసీఎంస్ కేంద్రం వరి ధాన్యం కొనుగోల్లు శుక్రవారంతో విజయవంతంగా పూర్తిఅయింది. 51250 బ్యాగులు, 60 లారీలు,40 ట్రాక్టర్లలో వరి ధాన్యం తరలించినట్లు నిర్వాహకులు మహిపాల్ రెడ్డి తెలిపారు.సెంటర్ ను విజయవంతంగా పూర్తిచేయడానికి సహకరించిన పిఏసిఎస్ చైర్మన్ ఎర్ర రఘునందన్ రెడ్డి, జిల్లా కలెక్టర్, అదనపు జిల్లా కలెక్టర్, సివిల్ సప్లై జిల్లా మేనేజర్ , గ్రామ సర్పంచ్ అయిట్ల లక్ష్మి సుదర్శన్ , ఉప సర్పంచ్ గంగారెడ్డి, డీసీఎస్ఓ, డి.సి.ఎం.స్ మేనేజర్, డీసీఎంస్ అధికారులు,సివిల్ సప్లై టీం,ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్, రైతులకు కేంద్రం నిర్వాహకులు మహిపాల్ రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. వరి ధాన్యం కొనుగోలు ప్రారంభం నుండి తనను వెన్ను తట్టి ప్రోత్సహించిన ఎర్ర రఘునందన్ రెడ్డి కి కేంద్రం నిర్వాహకులు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.

Leave a Reply