బ్రెయిన్ స్ట్రోక్‌తో ఆసుపత్రిలో మాజీ ఉపసర్పంచ్..

బ్రెయిన్ స్ట్రోక్‌తో ఆసుపత్రిలో మాజీ ఉపసర్పంచ్..
- ఆర్థిక సాయం కోసం కుటుంబ సభ్యుల విజ్ఞప్తి
వలిగొండ, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం సుంకిశాల గ్రామానికి చెందిన మాజీ ఉపసర్పంచ్, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కురుమ రాములకు ఇటీవల బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో ఆయన ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు.
ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆయనను హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఉన్న అపోలో ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. రెండు రోజుల క్రితం బ్రెయిన్ స్ట్రోక్ కారణంగా పక్షవాతం రావడంతో అత్యవసర చికిత్స కొనసాగుతోంది.
ఇప్పటికే చికిత్స కోసం లక్షల రూపాయలు ఖర్చయ్యాయని, ప్రస్తుతం కూడా రోజువారీ వైద్య ఖర్చులు అధికంగా ఉన్నాయని కుటుంబ సభ్యులు తెలిపారు. రాములు కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో దాతలు, ప్రజాప్రతినిధులు ముందుకు వచ్చి ఆర్థిక సహాయం అందించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఈ విషయానికి సంబంధించిన విజ్ఞప్తి ప్రస్తుతం సామాజిక మాధ్యమాలు, వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ అవుతోంది. భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి స్పందించి వైద్య చికిత్సకు అవసరమైన సహాయం అందించాలని కుటుంబ సభ్యులు, గ్రామస్థులు కోరుతున్నారు. మానవతా దృక్పథంతో దాతలు సహకరించి రాములు చికిత్సకు అండగా నిలవాలని వారు విజ్ఞప్తి చేశారు.
