Punjab | సంస్థాగత బలోపేతంపై బీజేపీ ఫోకస్

Punjab | సంస్థాగత బలోపేతంపై బీజేపీ ఫోకస్

Punjab | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌ : భారతీయ జనతా పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా కీలక నిర్ణయం తీసుకుంది. ఒకేసారి నాలుగు రాష్ట్రాలకు కొత్త అధ్యక్షులను నియమిస్తూ పార్టీ అధిష్టానం సంచలన నిర్ణయం ప్రకటించింది.

ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడిగా హర్ష్ మల్హోత్రా

ఢిల్లీ బీజేపీ నూతన అధ్యక్షుడిగా కేంద్ర మంత్రి హర్ష్ మల్హోత్రాను నియమించారు. అలాగే హర్యానా రాష్ట్ర అధ్యక్షురాలిగా అర్చన గుప్తాకు బాధ్యతలు అప్పగించారు.

పంజాబ్‌, త్రిపురకు కొత్త నేతలు

పంజాబ్ బీజేపీ అధ్యక్షుడిగా కేవల్ సింగ్ ధిల్లాన్‌ను, త్రిపుర రాష్ట్ర అధ్యక్షుడిగా అభిషేక్ దేబ్‌నాథ్‌ను నియమించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ నియామకాలు తక్షణమే అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికలు, సంస్థాగత బలోపేతం దృష్ట్యా పార్టీ అధిష్టానం ఈ మార్పులు చేపట్టినట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

Leave a Reply