రాఘవ కుటుంబాన్ని పరామర్శించిన బండి సంజయ్

రాఘవ కుటుంబాన్ని పరామర్శించిన బండి సంజయ్
ఆలేరు, ఆంధ్రప్రభ: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గ కేంద్రానికి చెందిన పులిపలుపుల మహేష్ కుమారుడు రాఘవ ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. విషయం తెలుసుకున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ బుధవారం రాత్రి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.
మహేష్ నివాసానికి చేరుకున్న బండి సంజయ్, రాఘవ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పుత్రశోకంతో అలమటిస్తున్న కుటుంబ సభ్యులను ఓదార్చి, వారికి తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. ప్రమాదం జరిగిన తీరును స్థానికులను అడిగి తెలుసుకున్నారు.
ఈ పరామర్శ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఊట్కూరు అశోక్ గౌడ్, స్థానిక పార్టీ నాయకులు చిరిగే శ్రీనివాస్, నంద గంగేష్, సముద్రాల కల్పన, ఎలగల వెంకటేష్, కర్రె ప్రవీణ్, తడిసిన మల్లారెడ్డి, సందీప్, ఆనంద్ పాల్గొన్నారు.
