గంజాయి సేవిస్తూ దొరికిన నలుగురు డీ-అడిక్షన్‌కు

గంజాయి సేవిస్తూ దొరికిన నలుగురు డీ-అడిక్షన్‌కు
క్యాతన్ పల్లి, ఆంధ్రప్రభ:
రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి సేవిస్తున్న నలుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని 15 రోజుల పాటు డీ-అడిక్షన్ కేంద్రానికి తరలించాలని స్థానిక న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.ఎస్ఐ జె. శ్రీధర్ తెలిపిన వివరాల ప్రకారం, ఉదయం పట్టణంలో సిబ్బందితో కలిసి పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు.
పోలీసులను గమనించిన వెంటనే వారు పారిపోయేందుకు యత్నించగా,సిబ్బంది చాకచక్యంగా వెంటాడి పట్టుకున్నారు.స్టేషన్‌కు తరలించి విచారించగా నలుగురూ గంజాయి సేవించినట్లుఅంగీకరించారువెంటనే ఘటనా స్థలంలో పంచనామా నిర్వహించి ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. అనంతరం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించగా ముగ్గురికి గంజాయి సేవించినట్లు నిర్ధారణ అయింది. నిందితులను న్యాయస్థానంలో హాజరుపరచగా, న్యాయమూర్తి నలుగురినీ 15రోజుల పాటు పునరావాస కేంద్రానికి తరలించాలని ఆదేశించారు. కాగా, సమయస్ఫూర్తితో వ్యవహరించి నిందితులను పట్టుకున్న ఎస్ఐ శ్రీధర్, సిబ్బంది సంజీవ్, అఖిల్ రెడ్డి,లను పోలీస్ ఉన్నతాధికారులు అభినందించారు.
