భావితరాల కోసం ప్లాస్టిక్ ను నిర్మూలిద్దాం

భావితరాల కోసం ప్లాస్టిక్ ను నిర్మూలిద్దాం

కమ్మర్ పల్లి, ఆంధ్రప్రభ: కమ్మర్ పల్లి మండల కేంద్రంలోని శుక్రవారం దేవి ఆలయం కోసం స్టిల్ ప్లేట్స్ మరియు స్టిల్ గ్లాస్ లను వితరణ చేసిన దాతలను దేవి ఆలయంలో కమ్మర్ పల్లి గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు మల్యాల సుభాష్ గౌడ్ మాట్లాడుతూ శుక్రవారం దేవి ఆలయం వద్ద ప్లాస్టిక్ ప్లేట్లు మరియు ప్లాస్టిక్ గ్లాసులను అధికంగా వినియోగించడంతో దాతల సహాయంతో స్టీల్ ప్లేట్స్ మరియు స్టీల్ గ్లాసులను కొనుగోలు చేసినట్లు తెలిపారు.సుమారు 6 వందల ప్లేట్లు మరియు గ్లాసులను వితరణ చేసిన రెంజర్ల మహేందర్,సంత నడిపి రాజేశ్వర్,సున్నం మోహన్,గుగ్గిళ్ల దేవరాజ్,గుగ్గిళ్ల గణేష్,పోల్కం రాజశేఖర్,సురేష్,మల్యాల శ్యామ్,కొమ్ముల రవి లను ఘనంగా సన్మానించినట్లు విడిసి చైర్మన్ మల్యాల సుభాష్ గౌడ్ తెలిపారు.దేవి పండుగను జరుపుకునే భక్తులకు,ప్రజలకు స్టీల్ ప్లేట్స్ మరియు స్టీల్ గ్లాసులను గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో అందుబాటులో ఉంచుతున్నామని గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్లాస్టిక్ వినియోగాన్ని నిర్ములించాలని,ప్లాస్టిక్ వాడడం వల్ల రోగాల బారిన పడకుండా ఉండాలని గ్రామ ప్రజలకు సూచించారు.

భవిష్యత్తు తరాల కోసమే ప్లాస్టిక్ వినియోగాన్ని నిర్మూలించి,స్టీల్ ప్లేట్లు,స్టీల్ గ్లాసులను అందుబాటులోకి తీసుకు వస్తున్నామని అన్నారు.అన్ని కార్యక్రమాలలో స్టీల్ ప్లేట్లు స్టీల్ గ్లాసులను వినియోగించాలని కోరారు.దాతలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.ఈ కార్యక్రమం లో ఉపసర్పంచ్ కొత్తపల్లి అశోక్,మాజీ ఎంపీటీసీ మైలారం సుధాకర్,విడిసి క్యాషియర్ పన్నాల రవి,కార్యదర్శి పెంట కిషన్ అమ్మవారి ఆలయ పూజారి రాము తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply