వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే తోట

జుక్కల్ (కామారెడ్డి), ఆంధ్రప్రభ : జుక్కల్ మండలంలోని చిన్నగుల్ల గ్రామానికి చెందిన కాంగ్రెస్ యువనాయకుడు లదే నర్సింగ్ వివాహం సన్వి తో చిన్నగుల్ల గ్రామంలో అంగరంగ వైభవంగా జరిగింది.ఇట్టివివాహ మహోత్సవానికి జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు హాజరై వధూవరులను ఆశీర్వదించి, వారి అతిత్యాన్ని స్వీకరించారు.

ఈ సందర్భంగా లదే నర్సింగ్ కుటుంబ సభ్యులైన సోదరులు ఆగ్రామ సర్పంచ్ లదే జ్ఞానేశ్వర్ బంధువులతో కలిసి ఎమ్మెల్యే తోట లక్ష్మికాంతారావుకు శాలువా పుష్ప గుచ్ఛంతో సన్మానించి వివాహానికి వచ్చినందుకు తమ కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ వివాహ మహోత్సవానికి ప్రజాప్రతినిధులు,కాంగ్రెస్ ముఖ్య నాయకులు, బంధుమిత్రులు హాజరయ్యారు.

Leave a Reply