ప్రగతి ప్రణాళిక వేదిక ప్రజా దర్బార్

ప్రగతి ప్రణాళిక వేదిక ప్రజా దర్బార్

  • ఎమ్మెల్యే జూలకంటి

మాచర్ల, ఆంధ్రప్రభ:

ప్రాంతాల అభివృద్ధి, ప్రజా సంక్షేమ ప్రగతికి ప్రణాళిక వేదిక ప్రజా దర్భార్ అని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి కొనియాడారు. శుక్రవారం స్ధానిక తహశీల్దార్ కార్యాలయంలో ఎమ్మెల్యే జూలకంటి అధ్యక్షతన ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ప్రజలు వారి సమస్యలపై అర్జీలు సమర్పించారు. భూ సమస్యలు, ఇంటి పట్టాలు, భూ కబ్జాలు, పట్టాదారు పాసుపుస్తకాలు కోసం, నూతన పింఛన్ల కొరకు, డ్రైనేజీలు, తాగునీటి సమస్య వంటి పలు సమస్యలపై దాదాపు 130 అర్జీలను అందజేశారు. వాటిని పరిశీలించిన అనంతరం తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఎమ్మెల్యే సూచించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమస్యల్లేని సమాజాన్ని సృష్టించడమే ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ లక్ష్యమని, వారి ఆదేశాల మేరకు నియోజకవర్గంలో నిరంతరం ప్రజాదర్భార్ ను నిర్వహిస్తున్నామని చెప్పారు. రెవిన్యూ సమస్యలపై ప్రత్యేక దృష్టిసారించి, భూ రీ- సర్వే ద్వారా భూ వివాదాలను పరిష్కరిస్తున్నామని చెప్పారు. నియోజకవర్గంలో ఐదేళ్ల వైసీపీ పాలనలో ఎందరివో భూములు, స్థలాలు కబ్జాలుకు గురైయ్యయని, వాటి పరిష్కరం చట్టప్రకారం జరిగేలా అన్నీ రకాల అధికారిక చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.

అనంతరం పట్టణంలోని కేసీపీ గెస్ట్ హౌస్ ఎదురుగా ఖాళీగా ఉన్న మున్సిపాలిటీ స్థలాన్ని ఎమ్మెల్యే పరిశీలించారు. రైతు బజారు, ఫ్రూట్ మార్కెట్ ఏర్పాటుకు స్థలాన్ని ప్రతిపాదత ప్రణాళికలు త్వరితగతిన సిద్దం చేయాలని మున్సిపల్ అధికారులకు ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఆదేశించారు. కేసీపీ యాజమాన్యంతో చర్చించి, ఏర్పాటుకు ప్రణాళికలు సిద్దం చేయాలని సూచించారు. అలానే పట్టణంలో మొయిన్ రోడ్డుకు ఉన్న పలు స్థలాల్లో బైక్ మెకానిక్ షెడ్లు, ఆటోమొబైల్ దుకాణాల ఏర్పాటు కూడా ప్రణాళికలు సిద్దం చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ కిరణ్ కుమార్, మున్సిపల్ కమిషనర్ వేణుబాబు, మాచర్ల మార్కెట్ యార్డ్ చైర్మన్ రాజబోయిన మధు, పట్టణ అధ్యక్షులు కొమెర దుర్గారావు, మండలాధ్యక్షులు నేరేటి వీరస్వామి, మద్దిగపు చిన్న వెంకటరామిరెడ్డి, కజ్జం సైదయ్య, గుండాల శ్రీనివాస యాదవ్ రెవిన్యూ, మున్సిపల్, విద్యుత్, ఫారెస్ట్, ఎంపీడీవో, పోలీసు, ఎండోమెంట్ వంటి పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply