జాతీయ రహదారి పనుల్లో డ్రైనేజీకి శాశ్వత పరిష్కారం

జాతీయ రహదారి పనుల్లో డ్రైనేజీకి శాశ్వత పరిష్కారం

  • తిరుచానూరు ఫ్లైఓవర్–దామినేడు మార్గంపై కలెక్టర్ సమీక్ష
  • పేరూరు సప్లై ఛానల్ నిర్మాణంపై ప్రత్యేక దృష్టి

తిరుపతి ప్రతినిధి, ఆంధ్రప్రభ: తిరుచానూరు ఫ్లైఓవర్ నుంచి దామినేడు వరకు జాతీయ రహదారి–71 విస్తరణ పనుల్లో భాగంగా నెలకొన్న డ్రైనేజీ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని కలెక్టర్ వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు. తిరుపతి కలెక్టరేట్‌లోని కలెక్టర్ ఛాంబర్‌లో శుక్రవారం జాతీయ రహదారి–71 విస్తరణ పనులపై జిల్లా కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు.

తిరుపతి రూరల్ మండలంలోని సి.మల్లవరం క్రాస్ నుంచి దామినేడు హౌసింగ్ కాలనీ వరకు ఉన్న ప్రధాన సమస్యలు, పేరూరు సప్లై ఛానల్ నిర్మాణం, రామానుజపల్లి జాతీయ రహదారి పరిధిలోని కాలనీల డ్రైనేజీ సమస్యలు, తిరుచానూరు ఫ్లైఓవర్ నుంచి దామినేడు వరకు నీటి పారుదల ఇబ్బందులపై సంబంధిత శాఖల అధికారులతో విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఆర్డబ్ల్యూఎస్, జిల్లా పంచాయతీ అధికారులు సమగ్ర ప్రతిపాదనలు సిద్ధం చేసి వారంలోపు సమర్పించాలని సూచించారు.

Leave a Reply