టీచర్ల సమస్యల పరిష్కారాన్ని ఎస్టియుటిఎస్ పోరాటాలు

తొర్రూరు, ఆంధ్రప్రభ : టీచర్ల సమస్యల పరిష్కారానికి ఎస్టీయూ టీఎస్ అలుపెరుగని పోరాటాలు చేస్తుందని ఆ సంఘం మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు గన్నోజు ప్రసాద్, ప్రధాన కార్యదర్శి కొరవి సుధాకరాచారిలు తెలిపారు. శుక్రవారం తొర్రూరు హైస్కూల్ లో ఎస్టీయూ టీఎస్ మహబూబాబాద్ జిల్లా రెండవ కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం జూన్ రెండు కు పి నివేదిక తెప్పించుకొని మెరుగైన పిఆర్సి అమలు చేయాలని కోరారు. వెంటనే ఉద్యోగులకు మెరుగైన పిఆర్సిని అమలు చేయాలని కోరారు.
పెన్షనర్లకు సంబంధించిన పెండింగ్ బకాయిలను చెల్లించాలని, ఉద్యోగులకు లబ్ధి చేకూరేలా ఈహెచ్ఎస్ ను పారదర్శకంగా అమలు చేయాలన్నారు. ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించిన పెండింగ్ బిల్లులను వెంటనే క్లియర్ చేయాలని డిమాండ్ చేశారు.కేజీబీవీ, ఎస్ఎస్ఏ లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఎంటిఎస్ అమలు చేయాలని, మోడల్ స్కూల్ లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు జీరో వన్ జీరో ద్వారా వేతనాలు చెల్లించాలన్నారు.
2020 పిఆర్సి లో ఉపాధ్యాయులకు రావలసిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ ను వెంటనే చెల్లించాలన్నారు. సిపిఎస్ ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరారు. ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్లు పరిష్కారం అయ్యేవరకు ఎస్టియు పోరాటం చేస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీరాములు, చంద్రప్రకాష్,గుంటుక శ్రీనివాస్, యాకయ్య, సిహెచ్ రమేష్,బి సంపత్ కుమార్, ఏకాంబరాచారి, సంపత్, హరికృష్ణ చారి, కుమార్, డాక్టర్ ధారావత్ సంతోష్,ఎస్టీయూ ప్రతినిధులు పాల్గొన్నారు.
