ప్రజా సేవలో ట్రాఫిక్ పోలీసులు

ప్రజా సేవలో ట్రాఫిక్ పోలీసులు
-ఎండవేడిమికి,వాహనదారులకు మజ్జిగ పంపిణీ.
-6వ ట్రాఫిక్ సీఐ ప్రభాకర్
పాయకాపురం, ఆంధ్రప్రభ:
ప్రజా సేవలో ట్రాఫిక్ పోలీసులు ముందంజలో ఉన్నారు.ఎండవేడిమికి వాహనదారులకు మజ్జిగ పంపిణీ కార్యక్రమం శుక్రవారం సింగ్ నగర్ ప్రాంతంలో చేపట్టారు. ఎండ తీవ్రంగా ఉన్న నేపద్యంలో నగర పోలీస్ కమిషనర్, ట్రాఫిక్ డీసీపీ ఆదేశాల మేరకు సింగ్ నగర్ 6వ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సీఐ ప్రభాకర్ సారథ్యంలో పాదాచారులకు, వాహనచోదకులకు మజ్జిగ పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ట్రాఫిక్ సీఐ ప్రభాకర్ మాట్లాడుతూ.. ఎండ తీవ్రత దృష్ట్యా వాహనచోదకులు మధ్యాహ్న సమయంలో బయటకు రావద్దని, ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని, మితిమీరిన వేగంతో వాహనాలను నడపవద్దని తెలియజేస్తూ,ప్రతి ఒక్కరూ సేవా గుణం అలవర్చుకొని ఇటువంటి శిబిరాలు ఏర్పాటు చేయాలని కోరారు. ఎండ వేడిమిని వాహనదారులపై పడకుండా సిగ్నల్ వ్యవస్థ వద్ద చలువడేరాలు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో సబ్ ఇన్స్పెక్టర్ కృష్ణ ,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
