accident | డ్రైవర్‌, టూరిస్ట్ గైడ్ మృతి.. పలువురికి గాయాలు

accident | డ్రైవర్‌, టూరిస్ట్ గైడ్ మృతి.. పలువురికి గాయాలు

accident | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌ : ఉత్తర్‌ప్రదేశ్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పర్యాటకులతో వెళ్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. నైమిశారణ్యం నుంచి అయోధ్యకు వెళ్తుండగా జరిగిన ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్‌తో పాటు టూరిస్ట్ గైడ్ మృతిచెందారు. ఈ ఘటనతో బస్సులో ఉన్న ప్రయాణికుల్లో ఆందోళన నెలకొంది.

50 మంది పర్యాటకులతో వెళ్తున్న బస్సు

ప్రమాద సమయంలో నరసరావుపేట, చిలకలూరిపేట ప్రాంతాలకు చెందిన సుమారు 50 మంది పర్యాటకులు బస్సులో ఉన్నట్లు సమాచారం. లక్నో, అయోధ్య మీదుగా నేపాల్ యాత్రకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు బాధితులు తెలిపారు.

ప్రయాణికులకు స్వల్ప గాయాలు

ప్రమాదంలో బస్సులో ఉన్న పలువురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు, సహాయక బృందాలు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని గాయపడిన వారిని సమీప ఆస్పత్రులకు తరలించారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.

Leave a Reply